ఆ ఇద్దరూ నా పరువు తీశారన్న టాప్ కమెడియన్

Tue Jun 02 2020 09:45:52 GMT+0530 (IST)

Vadivelu files a complaint against Kollywood actors Singamuthu and Manobala

తమిళ స్టార్ కమెడియన్ వడివేలు ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. రకరకాల వివాదాలతో ఆయ పేరు సౌత్ ఇండస్ట్రీలో మార్మోగింది. ఇప్పటికీ ఆయనను వివాదాలు విడిచిపెడుతున్నట్టు లేదు. తాజాగా  ఓ ఇద్దరిపై ఆయన నడిగరసంఘంలో ఫిర్యాదు చేయడం వేడెక్కించింది. తనపై అవమానకరంగా మాట్లాడిన ఆ ఇద్దరిపైనా వడివేలు ఫుల్ సీరియస్ గా ఉన్నారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సౌతిండియా ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (నడిగరసంఘం)లో మొరపెట్టుకున్నారు. ఆ ఇద్దరూ ఉద్ధేశపూర్వకంగా తన పరువు మార్యాదల్ని మంటకలిపారని ఎందరో ఉండే ఆర్టిస్టుల వాట్సాప్ గ్రూప్ లో ఆ విషయాన్ని షేర్ చేశారని వడివేలు ఆరోపించారు.ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరు? అంటే... వడివేలు కొలీగ్ ఆర్టిస్ట్ కం నిర్మాత మనోబాలా.. నటుడు సింగముత్తు. మనోబాలాకు వేస్ట్ పేపర్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. అక్కడ అతను ప్రముఖ మీడియా వ్యక్తులను ఇంటర్వ్యూ చేస్తాడు. అలాంటి ఒక ఇంటర్వ్యూలో నటుడు సింగముత్తు కనిపించారు. అక్కడ వారిద్దరూ రకరకాల సమస్యల గురించి మాట్లాడారు. ఇంటర్వ్యూలో మాట్లాడిన సింగముత్తు ప్రముఖ నటుడు వడివేలుతో తన సమస్య గురించి మాట్లాడినట్లు తెలిసింది. ఇది వడివేలుకు ఏమాత్రం గిట్టలేదు. వడివేలు ఈ సమస్యను సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (నాడిగర్ సంగం) వద్దకు తీసుకెళ్ళి తన గురించి అవమానకరంగా మాట్లాడినందుకు ఫిర్యాదు చేశారు.

మనోబాలా - సింగముత్తు కొన్ని సున్నితమైన విషయాల గురించి మాట్లాడినా వడివేలు మనోభావాలను గాయపరిచారట.  సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుండి చాలా మంది నటులు ఉన్న వాట్సాప్ గ్రూపులో మనోబాలా ఇంటర్వ్యూను పంచుకున్నారని వడివేలు ఆరోపించారు. ఈ చర్య తనకు ఇబ్బంది కలిగించిందని పేర్కొన్నాడు. ఇంటర్వ్యూలో తన పేరు దిగజారిందని పేర్కొంటూ అసోసియేషన్ లో ఆ ఇద్దరిపైనా ఫిర్యాదు చేశారు.

వడివేలు - సింగముతు అనేక సినిమాల్లో కలిసి నటించారు. ఆ ఇద్దరి కాంబినేషన్త తమిళ సినిమాల్లో ఎంతో పాపులర్. కొన్ని ఆస్తి గొడవల వల్ల వారు విడిపోయారు. ఇక కెరీర్ సంగతి చూస్తే.. వడివేలు శింబుతో మైస్కిన్ సినిమాలో కనిపించనున్నాడు. రాధాకృష్ణన్ పార్తిబన్ తోనూ ఓ ప్రాజెక్టును ప్రకటించే వీలుంది.  కమల్ హాసన్ నటించనున్న `తలైవన్ ఇరుకింద్రన్` చిత్రంలో వడివేలు కీలక పాత్ర పోషిస్తారని కథనాలొచ్చాయి.