కొన్ని పాటలు బాణీ డామినేట్ చేయకపోతే ఎంతో శ్రావ్యంగా మనసును హత్తుకునేలా కుదురుతాయి. అలాంటి కోవకే చెందుతుంది `వదిలి వెళ్లిపోకే`. ప్రేమ విరహం నేపథ్యంలో ఈ పాట ఎంతో శ్రావ్యంగా ఆకట్టుకుంటోంది.
కార్తీక్ రాజు- మిస్తీ చక్రవర్తి జంటగా నటిస్తున్న `దీర్ఘాయుష్మాన్ భవ` చిత్రంలోనిది ఈ పాట. ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ ఈ చిత్రంలో యముడి పాత్రలో నటించగా డాక్టర్ ఎంవీకే రెడ్డి సమర్పణలో ప్రతిమ ఈ సినిమా ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. పూర్ణానంద మిన్నకూరి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించారు. మలహర్ భట్ జోషి ఛాయాగ్రహణం అందించగా వినోద్ యాజమాన్య సంగీతం సమకూరుస్తున్నారు. కిషోర్ మద్దాలి ఎడిటర్ గా చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో ని `వదిలి వెళ్ళిపోకే అనే పాట` యూట్యూబ్ లో విడుదల కాగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతుంది. పాట ఆద్యంతం వినసొంపైన గాత్రం .. మిస్తీ అందంచందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎమోషనల్ పదజాలం హత్తుకుంటోంది.
సోసియో ఫాంటసీ ప్రేమకథా చిత్రం గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా త్వరలోనే విడుదలతేదీ ని ప్రకటించనున్నారు. నోయెల్- ఆమని- పృద్వీ- తాగుబోతు రమేష్- గెటప్ శ్రీను తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. వినోద్ యాజమాన్య సంగీతం అందిస్తుండగా... చిర్రావూరి విజయ్ కుమార్- రాంబాబు గోపాల- పూర్ణ చారి సాహిత్యం అందిస్తున్నారు.