Begin typing your search above and press return to search.

బికినీ వేసే బ్యూటీ.. ఇలా చీర కడితే

By:  Tupaki Desk   |   29 Jan 2023 6:00 PM GMT
బికినీ వేసే బ్యూటీ.. ఇలా చీర కడితే
X
బాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న అందాల భామ వాణి కపూర్. ఈ అమ్మడు తెలుగులో ఆహా కళ్యాణం అనే సినిమాతో నానికి జోడీగా నటించింది. అయితే ఈ సినిమా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇక తరువాత టాలీవుడ్ వైపు వాణి కపూర్ దృష్టి పెట్టలేదు. ఆమె ఫోకస్ అంతా కూడా బాలీవుడ్ సినిమాలవైపే ఉంది. గత ఏడాది సంషేరా సినిమాతో వాణి కపూర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ మూవీ డిజాస్టర్ అయిన కూడా వాణి కపూర్ కి మాత్రం మంచి పాత్ర దొరికింది.

ఇదిలా ఉంటే ఈ అమ్మడు అవకాశం దొరికితే ఈ పొడుగుకాళ్ల సుందరి తన అందాలతో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కి విందు అందిస్తుంది. రెగ్యులర్ గా హాట్ ఫోటోలతో సందడి చేస్తుంది. వాణి కపూర్ అందాలకి విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఇన్స్టాలో ఆమె ఫోటోలు పెడితే లక్షల్లో వ్యూస్ వస్తూ ఉంటాయి. ఈ బ్యూటీకి సినిమాల ద్వారా ఎంత ఫేమ్ వచ్చిందో అంతకంటే ఎక్కువగానే సోషల్ మీడియా ద్వారా వచ్చింది.

ఈ బ్యూటీ కెరియర్ చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా చాలా వరకు స్టార్ హీరోలతోనే చేసిందని చెప్పాలి. ఇదిలా ఉంటే వాణి కపూర్ తాజాగా ఎవరూ ఊహించని లుక్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేసింది. వైట్ కలర్ చీరలో ఎద అందాలు కనిపించే విధంగా కనిపించి కనిపించకుండా సోయగాలు చూపిస్తూ మోడరన్ మేనకలా మెరిసిపోతుంది.

ఈ చీరకట్టులో కూడా తన అందాన్ని చూడండి అనే విధంగా ఆమె ఫోటోలు ఉన్నాయి. ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన వాణి కపూర్ ఇలా ట్రెడిషనల్ ఇండియన్ శారీ లుక్ లో కనిపించినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా అందమైన భామలు చీర కట్టిన దాంతో కూడా కుర్రాళ్ళని కనువిందు చేసే అతిలోక సుందరిలా మరిపోగలరు. అలాగే మోడరన్ డ్రెస్సులు వేస్తూ అందాల జాతర చేస్తూ అజంతా శిల్పాల్లా మెరిసిపోగలరు అని వాణి కపూర్ ని చూస్తుంటే అర్ధమవుతుంది.