Begin typing your search above and press return to search.

`ఆహా క‌ళ్యాణం` బ్యూటీకి ఇక క‌ళ్యాణ‌మే

By:  Tupaki Desk   |   31 July 2021 4:30 PM GMT
`ఆహా క‌ళ్యాణం` బ్యూటీకి ఇక క‌ళ్యాణ‌మే
X
`ఆహా క‌ళ్యాణం` చిత్రంతో తెలుగు వారికి ప‌రిచ‌య‌మైన బ్యూటీ వాణీ క‌పూర్. నాని స‌ర‌స‌న న‌టించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద‌ వ‌ర్క‌వుట్ కాలేదు. ఆ త‌ర్వాత బాలీవుడ్ లో అసాధార‌ణ విజ‌యాల‌తో వాణీ దూసుకెళుతోంది. ఇటీవ‌లే వార్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీలో న‌టించిన వాణీ త‌దుప‌రి భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

మ‌రోవైపు వ‌రుస‌గా క్రేజీగా వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తోంది వాణీ. అలాగే సోష‌ల్ మీడియాల్లోనూ అసాధార‌ణ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. వాణీ తాజాగా ప్ర‌ఖ్యాత బ్రైడ్స్ టుడే క‌వ‌ర్ పేజీ పై ద‌ర్శ‌న‌మిచ్చింది. బ్రైడ్స్ కోసం ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో వాణీ ఫోటోషూట్ హీట్ పెంచుతోంది. బాలీవుడ్ అంద‌గ‌త్తెల్లో ఐదున్న‌ర అడుగుల ఎత్తుతో ఉండే వాణీ హాటెస్ట్ ఫోజ్ లు ప్ర‌స్తుతం అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. ఇక ఈ ఫోటోషూట్ లో ఆరెంజ్ క‌ల‌ర్ డిజైన‌ర్ లెహెంగాలో వాణీ కిల్ల‌ర్ లుక్ తో క‌ట్టి ప‌డేయ‌గా.. ఇతర ఫోటోల్లో వాణీ గ్లామ‌ర్ యాంగిల్ ని హాటెస్ట్ గా ఎలివేట్ చేశారు.

`ఆహా క‌ళ్యాణం` బ్యూటీ హాటెస్ట్ పెళ్లికూతురునే త‌ల‌పిస్తోంది! అంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. `స‌లార్` విల‌న్ వైఫ్ పాత్ర‌లో వార్ బ్యూటీ వాణీ క‌పూర్ న‌టిస్తోంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా `కేజీఎఫ్` ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ `స‌లార్` చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొద్ది భాగం షూటింగ్ కూడా జ‌రిగింది. త్వ‌ర‌లోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. ఇప్ప‌టికే ప్ర‌భాస్ కి విల‌న్ గా ఓ ప్ర‌ముఖ న‌టుడిని లాక్ చేశార‌ని ప్ర‌చార‌మైంది. ఇందులో విల‌న్ వైఫ్ పాత్ర కూడా క‌థ‌లో అంతే కీల‌కంగా ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. కీల‌క‌మైన విల‌న్ వైఫ్ పాత్ర కోసం వార్ బ్యూటీ వాణీ క‌పూర్ ని ఫైన‌ల్ చేసిన‌ట్లు క‌థ‌నాలొచ్చాయి.