Begin typing your search above and press return to search.

VS 11: తెలుగోడి ఆత్మ గౌరవంతో విశ్వక్ సేన్ ఫస్ట్ లుక్

By:  Tupaki Desk   |   28 May 2023 5:24 PM GMT
VS 11: తెలుగోడి ఆత్మ గౌరవంతో విశ్వక్ సేన్ ఫస్ట్ లుక్
X
యంగ్ హీరో విశ్వక్ సేన్ జెట్ స్పీడ్ తో తో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. తనకి సెట్ అయ్యే కథలని ఎంపిక చేసుకుంటూ వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక విశ్వక్ సేన్ నుంచి వచ్చే కథలు అన్ని కూడా కంటెంట్ బేస్డ్ తో ప్రేక్షకులకి భాగా కనెక్ట్ అవుతున్నాయి. తాజాగా దాస్ కా దమ్కీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.

హీరోగానే కాకుండా, నిర్మాతగా, దర్శకుడిగా ఈ మూవీ అతనికి మంచి గుర్తింపుని ఇచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కుర్ర హీరో సితార ఎంటర్టైన్మెంట్స్ లో కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబందించిన ఫస్ట్ లుక్ ని తాజాగా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా లాంచ్ చేశారు.

ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ లో కూడా జోహార్ ఎన్టీఆర్ తెలుగోడి ఆత్మగౌరవం అని రాసి దానికి బ్యాగ్రౌండ్ లో ఎన్టీఆర్ డ్రాయింగ్ కూడా ప్రెజెంట్ చేశారు. ఇందులో కంప్లీట్ మాస్ అవతార్ లో కనిపించడం విశేషం. దాంతో పాటు మేడలో దుర్గాదేవి లాకెట్ కూడా ఉంది. దీనిని బట్టి విశ్వక్ సేన్ రఫ్ క్యారెక్టర్ లోనే ఈ మూవీలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

గతంలో నితిన్ తో కృష్ణ చైతన్య పవర్ పేట అనే మూవీ చేయాలని అనుకున్నారు. విజయవాడ బ్యాక్ డ్రాప్ కంప్లీట్ మాస్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం రెండు భాగాలుగా తీయాలని భావించారు. అది ఎందుకనో సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇప్పుడు అదే స్టొరీని విశ్వక్ తో చేస్తున్నాడా అనే డౌట్ పోస్టర్ చూస్తూ ఉంటే వస్తోంది.

ఏది ఏమైనా విశ్వక్ సేన్ ఇప్పటి వరకు మాస్ రోల్స్ చేసిన ఈ తరహా గెటప్, లుక్ లో ఏ చిత్రంలోను కనిపించలేదు. అలాగే అతని గత సినిమాలలో మేకోవర్ పరంగా స్టైలిష్ గానే ఉండేవాడు.

అయితే మొదటిసారి కంప్లీట్ మాస్ అవతార్ లో దర్శనం ఇస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. త్రివిక్రమ్ పర్యవేక్షణలోనే ఈ చిత్రం రెడీ అవుతూ ఉండటంతో కచ్చితంగా కొత్తదనం ఉంటుందని భావిస్తున్నారు.