హ్యాపీ బర్త్ డే.. ఉస్తాద్ డైరెక్టర్..!

Fri Mar 31 2023 13:24:47 GMT+0530 (India Standard Time)

Happy Birthday.. Ustaad Bhagat Singh Director Harish Shankar

టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ లో ఆడియన్స్ పల్స్ పట్టేసిన డైరెక్టర్స్ కొందరే.. వారిలో కచ్చితంగా మెగా డైరెక్టర్ గా ముద్ర వేసుకున్న హరీష్ శంకర్ ఉంటారు. షాక్ తో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన హరీష్ శంకర్ సినిమా సినిమాకు గ్యాప్ ఎక్కువ తీసుకుంటున్నా హిట్ టార్గెట్ మాత్రం మిస్ అవరు. రీమేక్ సినిమాలతో పాటుగా తన కథలతో ఆడియన్స్ ని మెప్పిస్తూ వస్తున్న ఈ దర్శకుడు ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటికీ గుర్తు పెట్టుకునే మెమరబుల్ సూపర్ హిట్ గబ్బర్ సింగ్ ఇచ్చిన ఈ డైరెక్టర్ మళ్లీ పవన్ సినిమా కోసం చాలా ఏళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. అయితే ఈసారి గబ్బర్ సింగ్ కాదు అంతకు మించి ట్రీట్ ఇస్తానని చెబుతున్నారు డైరెక్టర్ హరీష్ శంకర్. తెరి రీమేక్ అని పవర్ స్టార్ ఫ్యాన్స్ కొద్దిగా అసంతృప్తిగా ఉన్నా ఆ కథ మూలాన్ని మాత్రమే తీసుకున్నా సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని చెబుతున్నారు హరీష్ శంకర్.  

సినిమా మీద సినిమా కథ మీద ఒక పర్ఫెక్ట్ ఐడియాలజీ ఉన్న హరీష్ శంకర్ వెంట వెంట సినిమాలు చేస్తే చూడాలని ఆడియన్స్ కోరుతున్నారు. పవన్ సినిమా తర్వాత ఇక మీదట దూకుడు పెంచాలని చూస్తున్నారు హరీష్ శంకర్. ఉస్తాద్ భగత్ సింగ్ త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తైంది. మే నెలలో ఉస్తాద్ భగత్ సింగ్ కు డేట్స్ ఇచ్చారట పవన్ కళ్యాణ్.

పవన్ డేట్స్ ఇచ్చినప్పుడే సినిమా మాక్సిమం లాగిచ్చేయాలని ఫిక్స్ అయ్యారు హరీష్ శంకర్. మే షెడ్యూల్ లో పవన్ తో సాధ్యమైనంతవరకు కానిచ్చి నెక్స్ట్ షెడ్యూల్ కూడా మరీ లేట్ కాకుండా మరో రెండు నెలల్లోనే పెట్టుకోవాలని చూస్తున్నారు.

డైరెక్టర్ గా తను చేసిన సినిమాల లెక్క కన్నా ఎక్కువ మంది ప్రేక్షకుల మనసులు గెలిచిన డైరెక్టర్ హరీష్ శంకర్ పుట్టినరోజు ఈరోజు ఇలాంటి బర్త్ డేలు ఎన్నో జరుపుకుని తెలుగు పరిశ్రమకు ఎన్నో అద్భుతమైన సినిమాలు.. హిట్లు సూపర్ హిట్లు కొట్టాలని ఆల్ ది బెస్ట్ చెబుతుంది తుపాకి టీమ్.