క్రికెటర్ తో స్టార్ హీరోయిన్ కిరికిరి.. ప్రాబ్లెమ్ ఏంటట?

Fri Aug 12 2022 19:08:45 GMT+0530 (India Standard Time)

Urvashi has already countered Rishabh

ప్రముఖ యువక్రికెటర్ .. పాపులర్ హీరోయిన్ నడుమ వాగ్వాదం ఇప్పుడు  మరింత రచ్చకెక్కుతోంది. జాతీయ మీడియా ఆ ఇద్దరి మధ్యా రచ్చను పదే పదే రిపీటెడ్ కథనాలుగా వేస్తోంది. అసలింతకీ ఆ ఇద్దరి మధ్యా ఏం జరుగుతోంది? నువ్వా నేనా?.. మనిద్దరిలో ఎవరు గొప్ప?! అంటూ తన్నుకునేంత సీన్ ఎందుకు వచ్చింది? అంటే వివరాల్లోకి వెళ్లాలి.ఈ సన్నివేశంలో హీరోయిన్ పేరు ఊర్వశి రౌతేలా. క్రికెటర్ రిషబ్ పంత్. ఆ ఇద్దరి గురించి తెలియని వారే లేరు. ఇటీవల కొంత కాలంగా ఆ ఇద్దరి మధ్యా ఏదో జరుగుతోందన్న ప్రచారం హోరెత్తుతోంది. రిషబ్ తో ఊర్వశి టేడింగ్ చేస్తోందంటూ కథనాలొస్తున్నాయి. కానీ ఇంతలోనే ఆ ఇద్దరి మధ్యా ఏమైందో కానీ అనుబంధం దెబ్బ తింది. ఒకరిపై ఒకరు సోషల్ మీడియాల్లో దెప్పి పొడుచుకోవడం కూడా సంచలనంగా మారింది.

ఇంతకుముందు ఓ చాటింగ్ సెషన్ లో ఊర్వశి రౌతేలా రిషబ్ పంత్ ను `మేరా పీచా చోడో బెహెన్` అని వ్యాఖ్యానించగా అతడు దానికి బిగ్ కౌంటర్ వేసాడు. దానిపైనా ఊర్వశి స్పందిస్తూ అతడిని `కౌగర్ హంటర్` అంటూ ఘాటైన కామెంట్ చేసింది. రిషబ్ పంత్ తనతో డేటింగ్ చేయడానికి ఆసక్తిగా ఉన్నాడని ఊర్వశి రౌతేలా ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే దానిపై క్రికెటర్ రిషబ్ పంథ్ ఇన్ స్టాగ్రామ్ లో ఖండించాడు కానీ వెంటనే పోస్ట్ ను తొలగించాడు. అనంతరం ఊర్వశి అతడిని `కౌగర్ హంటర్` అని తాజా ఇంటర్వ్యూలో కామెంట్ చేయడం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఊర్వశి ఓ క్రికెటర్ తో డేటింగ్ లో ఉందనే పుకార్ల నడుమ అతడు తనకోసం రాత్రి అంతా వేచి ఉన్నాడని మీడియా ముఖంగా వెల్లడించడం ఇరువురి నడుమా అగ్గి రాజేసింది. అతనిని ఒక రాత్రంతా వేచి ఉండేలా చేసిన సంఘటనను గుర్తుచేసుకుంటూ ఊర్వశి  ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే దీనిపై రిషబ్ వెంటనే స్పందించాడు. సోషల్ మీడియాల్లో దానిని ఖండించాడు. కానీ నిమిషాల వ్యవధిలోనే ఆ పోస్ట్ ను తొలగించడం చర్చకు వచ్చింది. మరోవైపు యంగ్ క్రికెటర్ పోస్ట్ పై ఊర్వశి కూడా ధీటుగా స్పందించింది. అతడు చేసిన పనికి స్పందనగా `అతడు కౌంటర్ హంటర్` అంటూ ఊర్వశి కామెంట్ చేసింది.

తాజా ఇంటర్వ్యూలో `ఆర్.పి` అని ప్రస్తావిస్తూ ఊర్వశి రౌతేలా గతాన్ని వెల్లడించింది. ఊర్వశి మాట్లాడుతూ-``నేను వారణాసిలో షూటింగ్ చేస్తున్నాను. అప్పట్లోనే న్యూఢిల్లీలో ఒక ప్రదర్శన ఇచ్చాను. నేను రోజంతా షూటింగ్ లో ఉన్నాను. అదే సమయంలో రాత్రి నేను షో కోసం సిద్ధమవ్వాల్సి వచ్చింది. మిస్టర్ ఆర్పీ నా కోసం వచ్చారు. లాబీలో వేచి ఉన్నారు. కానీ ప్రదర్శన తర్వాత నేను చాలా అలసిపోవడంతో నిద్రపోయాను. ఆ సమయంలో నాకు చాలా కాల్స్ వచ్చాయి`` అని తెలిపింది. అయితే మిస్టర్ RP ఎవరు? అని తనను ఇంటర్వ్యూయర్ ప్రశ్నించగా.. తన పేరును మాత్రం వెల్లడించలేదు. నేను నిద్ర లేచాక చూస్తే నాకు 16 నుండి 17 మిస్డ్ కాల్స్ వచ్చాయి. గౌరవంగా ఎవరైనా నా కోసం ఎదురు చూసారేమోనని నేను బాధపడ్డాను. అతను ఒక ప్రముఖ వ్యక్తి కాబట్టి తనని వేచి ఉండేలా చేయని అమ్మాయిలలో నేను కూడా (లవ్) ఉన్నాను. ఎదుటి వ్యక్తి పై నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. నేను తర్వాత ముంబైలో అతనిని కలవాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే అక్కడ (దిల్లీలో) నేను అతనిని కలవలేను. అలాగే ఆరోజు ఆ మీటింగ్ తర్వాత నన్ను ఫోటోగ్రాఫర్లు చుట్టుముట్టారు. మరుసటి రోజు ఇది పెద్ద వార్తగా మారింది. కొన్నిసార్లు మీడియా తరచుగా జోక్యం చేసుకుంటుంది. కొన్ని సార్లు ఏదైనా మంచి జరిగే అవకాశాలు ఉన్నా కానీ చివరికి అది చెడిపోతుంది!`` అని కూడా తన కలతను తెలిపింది.

రిషబ్ ఏమని పంచ్ వేసారు?

క్రికెటర్ రిషబ్ పంత్ - ఊర్వశి రౌతేలా జంట డేటింగ్ చాలా కాలంగా హాట్ టాపిక్. రెండేళ్ల క్రితం ఇద్దరూ కలిసి బహిరంగ ప్రదేశాల్లో జంటగా కనిపించేవారు. వారిది గొప్ప స్నేహం అంటూ ప్రచారమైంది.  అయితే కాలక్రమేణా స్నేహం చెడింది. పంత్ 2020లో ఊర్వశిని సోషల్ మీడియాలో బ్లాక్ చేశాడు. మళ్లీ కొంత గ్యాప్ తర్వాత మరోసారి పతాక శీర్షికల్లోకి ఎక్కారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి రౌతేలా తనను కలవడానికి గంటల తరబడి హోటల్ లాబీలో తన కోసం వేచి ఉన్న వ్యక్తి గురించి మాట్లాడింది. ఆ వ్యక్తిని `మిస్టర్ ఆర్పీ` అని కూడా పేర్కొంది. అప్పటి నుండి అందరూ RP అంటే రిషబ్ పంత్ అని ఊహిస్తున్నారు.

చివరికి రిషబ్ పంత్ కి కూడా ఇది చేరుకోగా...అతడు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ టైమ్ లైన్ లో క్రిప్టిక్ పోస్ట్ ను పంచుకున్నాడు. ``కొంత పాపులారిటీ కోసం .. హెడ్ లైన్స్ లోకి రావడం కోసం కొందరు ఇంటర్వ్యూలలో ఎలా అబద్ధాలు చెబుతారు. కొందరికి కీర్తి కోసం దాహం వేయడం విచారకరం. దేవుడు వారిని దీవించును గాక``  అని అన్నాడు. నన్ను ఒంటరిగా వదిలేయండి సోదరి.. అబద్ధం చెప్పడానికి ఒక పరిమితి ఉంది!! అని కూడా అతడు పంచ్ వేసాడు. అయితే పంత్ నిమిషాల వ్యవధిలోనే ఆ కథనాన్ని తొలగించాడు. కానీ నెటిజనులు ఆ పోస్ట్ తాలూకా స్క్రీన్ షాట్ లను సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసారు. డేటింగ్ చేస్తున్నానని పేర్కొన్న తర్వాత ఊర్వశిని సోషల్ మీడియా నుండి రిషబ్ బ్లాక్ చేయడంతో ఆ ఇద్దరి మధ్యా సన్నివేశం సీరియస్ గా మారింది.