Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: బొత్తాలు లేని బాలీవుడ్ రత్తాలు

By:  Tupaki Desk   |   29 March 2020 3:30 AM GMT
ఫోటో స్టోరీ: బొత్తాలు లేని బాలీవుడ్ రత్తాలు
X
పేరులో ఏముంది అని అంటూ ఉంటారు కానీ కొన్ని పేర్లకు వైబ్రేషన్స్ ఉండవు అనేది ఒప్పుకోవాల్సిందే. పేరులో ఏముంది అనేవారు తమ ఇంట్లో అమ్మాయికి సూర్యకాంతం అని.. శూర్పణఖ అని తాటకి అని పేర్లు పెట్టుకుంటారా? ఎవరూ పెట్టుకోరు. అలాగే కొంతమంది పేర్లు వినగానే అప్సరసలు గుర్తొస్తారు.. ఊర్వశి రౌతేలా అదే కేటగిరీ. పేరు గొప్ప ఊరు దిబ్బ బాపతు కాదు ఈ ఊర్వశి.. నిజంగానే అప్సరస ఊర్వశిని తలపిస్తుంది.

మోడల్ గా తన సత్తా చాటిన ఈ భామ 2015 లో మిస్ యూనివర్స్ పోటీల్లో కూడా పాల్గొంది. 'సింగ్ సాబ్ ది గ్రేట్'..'సనమ్ రే'.. 'గ్రేట్ గ్రాండ్ మస్తి'.. 'హేట్ స్టోరీ 4' లాంటి సినిమాల్లో నటించింది. హాట్ ఫోటో షూట్లు చేయడం ఈ భామకు వెన్నతో పెట్టిన విద్య. ఈ ఊర్వశి లాక్ డౌన్ పీరియడ్ లో కూడా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఉత్సాహపరుస్తూ ఉంది కానీ వారు మాత్రం పాత ఫోటోలను వైరల్ చెయ్యడం అనేది పనిగా పెట్టుకున్నారు. పైన కనిపిస్తున్న ఫోటో అలాంటిదే. వైట్ ఇన్నర్ వేర్.. పైనేమో బటన్లు పెట్టుకోకుండా వైట్ షర్టు ధరించి ఓ సెక్సీ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన భామ కావడంతో ఫోటోలోని అణువణువునా గ్లామరసం కనిపిస్తోంది.

ఇక ఊర్వశి రౌతేలా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం 'వర్జిన్ భానుప్రియ' అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. అజయ్ లోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గౌతమ్ గులాటి హీరోగా నటిస్తున్నాడు. ఇదో కామెడీ డ్రామా అని సమాచారం.