Begin typing your search above and press return to search.

ప్చ్‌! ఇంత డెక‌రేట్ చేసుకొస్తే ప‌ట్టించుకోరా?

By:  Tupaki Desk   |   19 Feb 2020 7:11 AM GMT
ప్చ్‌! ఇంత డెక‌రేట్ చేసుకొస్తే ప‌ట్టించుకోరా?
X
స‌హ‌జంగానే హీరోయిన్ల‌కు హంగులు ఆర్భాటాలు ఎక్కువే. కొద్ది మంది మాత్ర‌మే సింప్లిసిటీకి ప్రాధాన్య‌త‌ ఇస్తారు. స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకున్న నాయిక‌లు టూమ‌చ్ ఆర్భాటాల జోలికి వెళ్ల‌రు. సంద‌ర్భాన్ని బ‌ట్టి ఫాలో అవుతుంటారు. ఏ వేదికకు ఎలా క‌నిపించాలి? ఎలాంటి డ్రెస్‌ వేసుకుని వెళ్లాలి? ఎక్క‌డ ఎలా మెల‌గాలి! అన్న‌దానిపై బ్యాలెన్సింగ్ గా ఉంటారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ఊర్వ‌శీ రౌతేలా ఓ ఈవెంట్ లో చేసిన హ‌డావుడి ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. మొన్న‌ ఫిలిం ఫేర్ అవార్డుల‌ వేడుక‌లో భారీత‌నం నిండిన‌ ఎర్ర లాంగ్ గౌనులో త‌ళుక్కున మెరిసింది. ఈ వేడుక‌లో బాలీవుడ్ హీరోయిన్లు.. మోడ‌ల్స్ స‌హా టాప్ సెల‌బ్రిటీలు హాజ‌ర‌య్యారు. కానీ వాళ్లంద‌రిలో ఊర్వ‌శి స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచింది.

రెడ్ గౌనులో అమ్మ‌డి అందం రెట్టింపైనా... అమ్మ‌డి వ్య‌వ‌హార‌మే కాస్త అతిగా అనిపించింద‌ట‌. బాలీవుడ్ హీరోయిన్లు అంతా చాలా సింపుల్ గా హాజ‌రైతే.. ఊర్వ‌శి మాత్రం అత్తెస‌ర స్టాట‌స్ తోనే బోలెడంత‌ బిల్డ‌ప్ ల‌కు పోయింద‌న్న విమ‌ర్శ‌లు ఎదుర్కొంది. ఆ గౌనుతో వేదిక ముందు వ‌రుస సీటులో కూర్చొన్న త‌ర్వాత గౌను స‌ర్దుకోవ‌డానికే నానా తిప్ప‌లు ప‌డింది. ఆ గౌనును అందంగా ఓ ప‌ద్ద‌తిగా అమ‌ర్చ‌డానికి న‌లుగురైదుగురు స‌హాయకులు వెంట వ‌చ్చారు. దానికి సంబంధించిన వీడియో...ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. దీంతో నెటిజ‌నులు ఘాటైన‌ కామెంట్లు గుప్పించారు.

పాప ఎంత హ‌డావుడి చేసినా బాలీవుడ్ లో మాత్రం స‌రైన ఛాన్సులు అందుకులేక‌పోతుంద‌ని చుర‌క‌లు వేస్తున్నారు కొంద‌రైతే. ఉత్త‌రాది జ‌నం అమ్మ‌డిని సెకెండ్ గ్రేడ్ హీరోయిన్ గానే చూస్తున్నారు. అవార్డు ఫంక్ష‌న్ కి స్టార్ హీరోయిన్లే సింపుల్ గా వ‌స్తే..ఊర్వ‌శి తెగ వెంప‌ర్లాడుతూ ఇలా త‌యారవ్వ‌డం..వెంట స‌రంజామా వేసుకుని వ‌చ్చినా అక్క‌డ ఎవ‌రూ ప‌ట్టించుకోక‌ పోవ‌డం చ‌ర్చ‌కొచ్చింది. తొలిగా మిరుమిట్లు గొలిపే ఈ ఎర్ర గౌన్ సుంద‌రి ఎవ‌రా? అని ఓ లుక్ వేసినా త‌ను ఎవరో తెలిశాక మాత్రం లైట్ తీస్కున్నార‌ట‌. అన్న‌ట్టు ఈ రెడ్ గౌన్ డిజైన్ చేసేందుకు ఏకంగా 730 గంట‌లు ప‌ట్టింద‌ట తెలుసా?