Begin typing your search above and press return to search.

తమిళం హిందీలో `ఉప్పెన` రీమేక్.. అక్క‌డ‌ హీరోలు ఎవ‌రు?

By:  Tupaki Desk   |   24 Feb 2021 2:30 AM GMT
తమిళం హిందీలో `ఉప్పెన` రీమేక్.. అక్క‌డ‌ హీరోలు ఎవ‌రు?
X
మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ -కృతి శెట్టి జంట‌గా న‌టించిన ఉప్పెన టాలీవుడ్ లో సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన సంగ‌తి తెలిసిందే. నెవ్వ‌ర్ బిఫోర్ డెబ్యూ అన్న రీతిన‌ 100 కోట్ల గ్రాస్ క్ల‌బ్ లో ఉప్పెన‌ అడుగుపెట్ట‌నుంది. నాయ‌కానాయిక‌ల అద్భుత కెమిస్ట్రీ..రొమాన్స్.. సేతుప‌తి విల‌నిజం.. దర్శకుడు బుచ్చిబాబు సన ప్ర‌తిభ విమ‌ర్శ‌కుల్ని మెప్పించాయి. ఓవ‌ర్ నైట్ లో స్టార్లు అయిపోయారంతా. ప్ర‌స్తుతం ప‌ర‌ భాషా నిర్మాతల నుండి రీమేక్ హక్కుల కోసం క్రేజీ ఆఫర్లను ద‌క్కించుకుంటోంది మైత్రి సంస్థ‌.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ `ఉప్పెన`ను హిందీలో రీమేక్ చేయడానికి స‌న్నాహ‌కాల్లో ఉంద‌ని తెలిసింది. యువ తారలు ఇషాన్ ఖత్త‌ర్ - ఖాలి పీలీ ఫేమ్ అనన్య పాండే జంట‌గా ఈ సినిమాని హిందీలో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

దీనికి సంబంధించిన‌ అధికారిక ప్రకటన వెలువ‌డాల్సి ఉంటుంది. మరోవైపు `ఉప్పెన` తమిళ రీమేక్ కూడా క‌న్ఫామ్ అయిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ‌ కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజయ్ కుమారుడు జాసన్ విజయ్ నటించే అవ‌కాశం ఉంద‌ని గత కొన్ని రోజులుగా క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. అయితే అటు త‌మిళం- హిందీలోనూ ఇదే చిత్రంతో మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ ఎంట్రీ ఇస్తే బావుంటుంద‌నేది అభిమానుల అభిప్రాయం. మ‌రి ఏది నిజ‌మ‌వుతుందో వేచి చూడాలి.