Begin typing your search above and press return to search.

స్టార్ హీరో భార్య మళ్లీ మొదలుపెట్టింది..

By:  Tupaki Desk   |   20 Oct 2020 2:30 AM GMT
స్టార్ హీరో భార్య మళ్లీ మొదలుపెట్టింది..
X
కన్నడ స్టార్ హీరో, విలక్షణ నటుడు ఉపేంద్ర గురించి తెలియని దక్షిణాది అభిమానులు ఉండరు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో విలన్ గా ఆయన చేసిన పాత్ర అందరికీ సుపరిచితమే. మంచి నటుడైన ఈ స్టార్ హీరో అప్పట్లో హీరోయిన్ ప్రియాంకను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.పెళ్లయ్యాక ప్రియాంక సినిమాలకు దూరమైంది. కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయింది.

అయితే తాజాగా ప్రియాంక మళ్లీ సినిమాల బాటపట్టింది. లాక్ డౌన్ పీరియడ్ లో గ్యాప్ వచ్చాక ఆమె మనసు మార్చుకుంది. తాజాగా ‘ఉగ్రావతార’ సినిమా షూటింగ్ తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. మరోవైపు కొత్త సినిమాలను అంగీకరిస్తున్నారు.

తాజాగా ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ అనే మూవీకి ప్రియాంక సైన్ చేశారు. తాజాగా మరో థ్రిల్లర్ మూవీకి ఓకే చెప్పారు.

ఈ దసరాకు ‘1980’ అనే థ్రిల్లర్ మూవీలో నటించేందుకు ప్రియాంక అంగీకరించింది. ఈ కథ బాగా నచ్చడంతో ఈ సినిమాను ఒప్పుకున్నానని ప్రియాంక తెలిపింది. దసరా రోజు అధికారికంగా ఈ సినిమా ప్రారంభమవుతుందని ప్రకటించింది.

ఇలా పెళ్లయ్యాక సినిమాలకు దూరమైన ప్రియాంక తాజాగా వరుసగా సినిమాలను ఒప్పుకుంటూ కథా ప్రాధాన్యమున్న చిత్రాలను చేస్తోంది. ఇప్పటికే ఆమె చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. ఎక్కువగా హర్రర్, పీరియాడికల్, ప్రాధాన్యమున్న కథలను ఎంచుకుంటూ ప్రియాంక మళ్లీ సినిమాల్లో బిజీ అవుతోంది.