NBK 108 యాక్షన్ తోనే మొదలు పెడతారట..!

Tue Dec 06 2022 13:10:49 GMT+0530 (India Standard Time)

Latest Updates On Balakrishna New Movie NBK108

యువ హీరోలకు ధీటుగా సినిమా వెంట సినిమాతో దూసుకెళ్తున్నాడు నందమూరి నట సింహం బాలకృష్ణ. ప్రస్తుతం ఎన్.బి.కె 107 సెట్స్ మీద ఉండగా అది చివరి దశకు రాగానే నెక్స్ట్ చేస్తున్న అనీల్ రావిపుడి మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు.డిసెంబర్ 8న బాలకృష్ణ అనీల్ రావిపుడి మూవీ సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. 12 రోజుల పాటు జరిగే ఈ తొలి షెడ్యూల్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తారట. అనీల్ రావిపుడి ఇప్పటివరకు చేసిన సినిమాలన్ని ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి.

ఫస్ట్ టైం కెరీర్ లో ఫుల్ లెంగ్త్ మాస్ మూవీ చేస్తున్నాడు అనీల్ రావిపుడి. అయితే ఈ మూవీలో బాలయ్య మార్క్ మాస్ అంశాలు ఉన్నా సినిమా మాత్రం తన పంథాలో ఎంటర్టైనింగ్ గా సాగుతుందని అంటున్నారు. బాలయ్యతో సినిమా వేరే లెవల్ అంటూ ఊరిస్తున్న డైరెక్టర్ అనీల్ రావిపుడి ఫస్ట్ షెడ్యూల్ తోనే యాక్షన్ సీన్స్ తో అదరగొట్టేస్తున్నాడు. ఈ యాక్షన్ సీన్స్ కూడా రెగ్యులర్ బాలకృష్ణ సినిమాల్లో ఉండేలా కాకుండా అనీల్ కొత్తగా ప్లాన్ చేస్తున్నాడట.

పటాస్ టు ఎఫ్ 3 అనీల్ సినిమా అంటే పక్కా హిట్ అన్న సెంటిమెంట్ ఏర్పరచుకున్న ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఫస్ట్ టైం ఒక మాస్ మూవీ చేస్తున్నాడు. బాలయ్యతో సినిమా అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకోవాల్సిందే. ఎన్.బి.కె 107వ మూవీ సంక్రాంతికి వస్తుంది.

108వ సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ టార్గెట్ చేస్తున్నారు. ఈ మూవీలో పెళ్లిసందడి ఫేం శ్రీ లీల ప్రధాన పాత్రలో నటిస్తుండగా బాలయ్యకి జోడీగా ప్రియాంక జవల్కర్ నటిస్తుందని తెలుస్తుంది.

బాలయ్యలోని కామెడీ యాంగిల్ ని ఈ మూవీలో చూపించబోతున్నారు అనీల్ రావిపుడి. ఇక ఈ మూవీ తర్వాత ఆదిత్య 999 మ్యాక్స్ మూవీ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు బాలకృష్ణ. ఆ సినిమాని తన డైరెక్షన్ లోనే తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు. బాలయ్య దర్శక నిర్మాతగా ఆదిత్య 999 మ్యాక్స్ వస్తుందని తెలుస్తుంది.