Begin typing your search above and press return to search.

ఎంత ఫాస్ట్‌ గా వచ్చిందో అంతే ఫాస్ట్‌ గా గ్రాఫ్‌ పడిపోయింది

By:  Tupaki Desk   |   7 Dec 2022 1:30 AM GMT
ఎంత ఫాస్ట్‌ గా వచ్చిందో అంతే ఫాస్ట్‌ గా గ్రాఫ్‌ పడిపోయింది
X
హిందీ సినిమా సూపర్ 30 లో చిన్న పాత్రలో నటించిన కృతి శెట్టి గత ఏడాది ఉప్పెన సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా హీరో వైష్ణవ్‌ తేజ్ హీరోగా బుచ్చి బాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఉప్పెన విడుదలకు ముందే కృతి శెట్టి కి మంచి గుర్తింపు లభించింది.

ఉప్పెన విడుదల కాకుండానే ఈమె కొన్ని సినిమాలకు సైన్ చేసింది. ఇక ఉప్పెన విడుదల తర్వాత బేబమ్మ అంటూ ఈ అమ్మడికి పెద్ద ఎత్తున ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగింది. ఉప్పెన తర్వాత బ్యాక్ టు బ్యాక్ శ్యామ్‌ సింగరాయ్ మరియు బంగర్రాజు సినిమాలతో కూడా కృతి శెట్టి సక్సెస్‌ లను దక్కించుకుంది.

వరుసగా మూడు సినిమాలు సక్సెస్ అవ్వడం తో అమ్మడి యొక్క జోరు మరింత పెరిగింది. అయితే అక్కడ ఆమెకు దెబ్బ పడింది. రామ్‌ తో నటించిన ది వారియర్‌ సినిమా మొదటి షాక్ ను కృతి శెట్టికి ఇచ్చింది. ఆ సినిమా లో విజిల్‌ వేసి మరీ నటించినా కూడా అమ్మడికి సక్సెస్ దక్కలేదు. అందమైన కృతికి అవకాశాలు వస్తున్నాయి కానీ సక్సెస్ లు దక్కడం లేదు.

ది వారియర్‌ తర్వాత వెంటనే మాచర్ల నియోజక వర్గం సినిమాతో నితిన్‌ తో కలిసి కృతి శెట్టి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కూడా తీవ్రంగా నిరాశ పరిచింది. ఆ తర్వాత సుధీర్ బాబు హీరోగా నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా తో వచ్చింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.

వరుసగా మూడు హిట్‌ సినిమాలు దక్కించుకున్న కృతి ఆ వెంటనే మూడు ఫ్లాప్ లను మూట కట్టుకుంది. దాంతో ఈ అమ్మడికి ఆఫర్లు చప్పున చల్లారాయి. ఎంత ఫాస్ట్‌ గా కెరీర్ లో స్టార్‌ డం దక్కించుకుందో.. ఎంత ఫాస్ట్‌ గా భారీ క్రేజ్ దక్కించుకుందో అంతే ఫాస్ట్ గా కృతి యొక్క ఆధరణ తగ్గిపోయింది. కేవలం రెండేళ్ల కాలంలో ఈ అమ్మడు మొత్తం కెరీర్ ను చూసింది.

ఇక నుండి అయినా సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ కాస్త స్పీడ్ తగ్గించి క్వాలిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. పడిపోయిన గ్రాఫ్ ను మళ్లీ లేపాలంటే కాస్త ఎక్కువ సమయం పడుతుంది.. ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అందుకే కృతి శెట్టి కెరీర్‌ విషయంలో మీడియాలో రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి.