Begin typing your search above and press return to search.

మళ్లీ ఉసూరుమనిపిస్తున్న వీర మల్లు

By:  Tupaki Desk   |   23 Jan 2023 10:59 AM GMT
మళ్లీ ఉసూరుమనిపిస్తున్న వీర మల్లు
X
పవన్ కళ్యాణ్ కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. నిజానికి పవన్ కళ్యాణ్ ని ఇప్పటివరకు ఇలాంటి పీరియాడిక్ సినిమాలలో కనిపించింది లేదు. కానీ మొట్ట మొదటిసారి క్రిష్ దర్శకత్వంలో ఆయన మొగలాయిల కాలంలో ఒక బందిపోటు దొంగగా కనిపించబోతున్నారు.

తెలంగాణ ప్రాంతానికి చెందిన పండుగలు, సాయన్న అనే ఒక బందిపోటు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారనే ప్రచారం ఉంది. ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరుందిన ఆయన జీవిత కథను ఆధారంగా చేసుకుని దానికి కొంత సినిమా తెరకెక్కిస్తున్నారని అంటున్నారు. కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్లుగా అనేక కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది.

ఒకసారి కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడడం.. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వరకు అనేక కారణాలతో ఈ సినిమా వెనక్కి వెళుతూ వస్తోంది. ఇప్పటికే క్రిష్​ టీం విడుదల చేసిన కొన్ని వీడియోల వల్ల సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి.

ఎం ఎం కీరవాణి ఇచ్చిన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలాగే సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో చేసిన కొన్ని మేకింగ్ వీడియోస్ కూడా సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి.

అయితే జనవరి 26వ తేదీన ఈ సినిమా టీజర్ విడుదలయ్యే అవకాశం ఉందని ఈ మధ్య ప్రచారం మొదలైంది కానీ.. అది నిజం కాదని తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ సినిమా సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి అమెరికాలో ఉన్నారు.

ఆస్కార్లో ఆర్ఆర్ఆర్​ ను ప్రమోట్ చేయడం కోసం వెళ్ళిన రాజమౌళి టీం లో కీరవాణి కూడా ఒకరిగా ఉన్నారు. ఆయన ఇప్పటికి ఇప్పుడు వచ్చి ఆ టీజర్ ని రెడీ చేయడం కుదిరే పని కాదు. కాబట్టి 26వ తేదీన టీజర్ రిలీజ్ చేయడం అనేది కుదిరే పని కాదని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.