యశోద ఓటిటి రిలీజ్ డేట్ లాక్..!

Tue Dec 06 2022 20:57:44 GMT+0530 (India Standard Time)

Update on Yashodha Movie OTT Date

సమంత లీడ్ రోల్ లో దర్శక ద్వయం హరి హరీష్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ యశోద. సరోగసీ కాన్సెప్ట్ తో కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ రిఫరెన్స్ తో ఈ మూవీని తెరకెక్కించారు దర్శకులు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించారు. సినిమాను తకువ బడ్జెట్ తో పూర్తి చేయాలని అనుకోగా సమంత రాకతో అది భారీ బడ్జెట్ మూవీగా మారింది. దాదాపు యశోద సినిమా 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినట్టు తెలుస్తుంది. నవంబర్ 11న వరల్డ్ వైడ్ రిలీజైన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది.అయినా సరే సమంత క్రేజ్ తో సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. వరల్డ్ వైడ్ గా సినిమా లాభాలు తెచ్చిందని టాక్. ఇక ఇదిలాఉంటే రిలీజై నెల రోజులు పూర్తి కాకుండానే యశోద సినిమా ఓటీటీ రిలీజ్ అవుతుంది.

డిసెంబర్ 9న సౌత్ అన్ని భాషలతో పాటుగా హిందీ వర్షన్ లో కూడా యశోద రిలీజ్ అవుతుంది. ఈ సినిమా చూసిన చాలామంది ఆడియన్స్ ఇది ఓటీటీ రిలీజ్ కంటెంట్ అని అన్నారు. ఓటీటీల నుంచి ఫ్యాన్సీ ఆఫర్లు వచ్చినా నిర్మాత పట్టుబట్టి థియేట్రికల్ రిలీజ్ చేశారు.

యశోద సినిమా థియేట్రికల్ లో యావరేజ్ టాక్ తెచ్చుకోగా ఓటీటీలో మాత్రం హిట్ కొడుతుందని అంటున్నారు. ఈ సినిమా డిసెంబర్ 9న అమెజాన్ ప్రైం లో రిలీజ్ అవుతుంది. సినిమాలో సమంత నటనకు ఆమె ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ ప్రియులు కూడా ఫిదా అయ్యారు. ముఖ్యంగా సమంత యాక్షన్ ఎపిసోడ్స్ అదరగొట్టింది. ఆల్రెడీ ఫ్యామిలీ మ్యాన్ 2 సీరీస్ తో బాలీవుడ్ ఆడియన్స్ ని అలరించిన సమంత యశోదతో మరోసారి తన సత్తా చాటింది.

పుష్ప సినిమాలో ఊ అంటావా సాంగ్ తో కూడా నార్త్ ఆడియన్స్ కి నచ్చేసింది సమంత. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో ఎలాంటి పాత్రనైనా సరే ఛాలెంజింగ్ గా తీసుకుని చేసే ఈతరం మహానటి సమంత మాత్రమే.. అందుకే రీసెంట్ గా బడా నిర్మాతలు సురేష్ బాబు అల్లు అరవింద్ కూడా ఆమెను మహానటి అని ఒప్పుకొన్నారు.

యశోద తర్వాత సమంత ప్రస్తుతం శాకుంతలం ఖుషి సినిమాల్లో నటిస్తుంది. ప్రస్తుతం మయోసైటిస్ కారణంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమంత అది పూర్తిగా తగ్గిన తర్వాతే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లు చేయనుంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.