వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్.. 18రోజుల్లో ఎంతంటే?

Tue Jan 31 2023 16:09:43 GMT+0530 (India Standard Time)

Update on Waltair Veerayya 18 Days Collections

మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ను అందుకుంది. ఈ చిత్రం తొలి రోజు నుంచి అదిరిపోయే వసూళ్లను అందుకుంటోంది.మెగాస్టార్ కెరీర్లోనే ఇప్పటివరకు వాల్తేరు వీరయ్య బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. అయితే ఈ చిత్రం విడుదలై 18రోజులైనా తన జోరును ఇంకా తగ్గించలేదు. బాక్సాఫీస్ ముందు దుమ్ము రేపుతోంది.

అయితే తాజాగా 18వ రోజు కలెక్షన్ వివరాలు బయటకు వచ్చాయి.

18వ రోజు తెలుగు రాష్ట్రాలు ఏపీ తెలంగాణలో కలిపి రూ.56 లక్షలు వచ్చాయి. మొత్తంగా రూ.112.81కోట్ల నెట్.. రూ.182.20కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి రూ.8.05కోట్లు ఓవర్సీస్లో రూ.13.07కోట్లు వచ్చాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ.133.93 కోట్ల నెట్.. రూ.228.40కోట్ల గ్రాస్ వచ్చాయి.

ఇకపోతే ఈ చిత్రం వరల్డ్ వైడ్గా రూ. 88 కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే ఈ మూవీ రూ. 89 కోట్లు అందుకుంటేనే సక్సెస్ అయినట్టు. ఇప్పుడు ఈ సినిమా మొత్తంగా షేర్ కలెక్షన్స్ రూ.133.93 కోట్లు దాటడంతో ఇప్పుడీ చిత్రం రూ.44.93 కోట్ల వరకు లాభం సంపాదించింది. ఇంకా ఇదే జోరు కొనసాగితే వాల్తేరు మరిన్ని లాభాలు వస్తాయి.

కాగా చిరంజీవి-రవితేజ ఈ చిత్రంలో అన్నదమ్ములుగా నటించారు. ముఖ్యంగా యాక్షన్ డ్యాన్స్లు సహా బ్రదర్ సెంటిమెంట్ ఎలిమెంట్స్ ఆడియెన్స్ను బాగా ఆక్టటుకున్నాయి. చిరు డ్యాన్స్లు నటన చూసిన వారందరూ వింటేజ్ చిరంజీవిని చూసినట్లు ఉందని చెబుతున్నారు.

మొత్తంగా ఫ్యామిలీ ఆడియెన్స్ను ఈ సినిమా వీపరీతంగా అలరిస్తోంది. ప్రకాష్ రాజ్ బాబీ సింహ కీలక పాత్రల్లో నటించారు. శ్రుతి హాసన్ కేథరిన్ హీరోయిన్స్గా కనిపించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.  నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.