వెంకీ.. నితిన్.. ఇదే కరెక్ట్..!

Fri Mar 17 2023 20:00:01 GMT+0530 (India Standard Time)

Update on Venky Kudumula and Nitin Film

నాగ శౌర్యతో ఛలో అని తీసి హిట్ అందుకున్న డైరెక్టర్ వెంకీ కుడుముల సెకండ్ మూవీ నితిన్ తో భీష్మ తీసి అది కూడా హిట్ కొట్టాడు. రెండు సినిమాల్లో రష్మిక హీరోయిన్ గా నటించింది. భీష్మ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో వెంకీ సినిమా ఉంటుందని అన్నారు. కథ లాక్ అయినా స్క్రీన్ ప్లే విషయంలో చిరుని ఇంప్రెస్ చేయలేకపోయాడు వెంకీ కుడుముల.అందుకే ఆ సినిమా క్యాన్సిల్ చేసుకున్నాడు. అసలైతే దానయ్య డివివి నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో సినిమా ఉండాల్సింది. కానీ ఆ ప్రాజెక్ట్ అటకెక్కేసింది.

ఇక కొద్దిపాటి గ్యాప్ తర్వాత వెంకీ కుడుముల నితిన్ తో సినిమాతో సినిమా లైన్ లో పెట్టాడు. నితిన్ తో ఆల్రెడీ భీష్మ సినిమా తీసి సక్సెస్ అందుకున్న వెంకీ మరోసారి అతనితో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.

ఈ సినిమా పీరియాడికల్ డ్రామాగా వస్తుందని తెలుస్తోంది. ఛలో భీష్మ రెండు సినిమాలు ఎంటర్టైనింగ్ కథలతోనే ఆడియన్స్ ని అలరించాయి. అయితే నితిన్ తో చేస్తున్న నెక్స్ట్ సినిమా పీరియాడికల్ కథ అంటున్నారు. వస్తున్న సమాచారం ప్రకారం పుష్ప దసరా తరహాలో కథ సాగుతుందట.

మరి కామెడీ సినిమాలు తీసి హిట్ అందుకున్న వెంకీ నితిన్ తో ఇలాంటి రిస్క్ అవసరమా అంటున్న వారు ఉన్నారు. అయితే డైరెక్టర్ గా రెండు హిట్లు కొట్టిన వెంకీ థర్డ్ మూవీ తను ఇలాంటి సినిమాలు కూడా చేయగలను అని ప్రూవ్ చేసేందుకే పీరియాడికల్ కథ ఎంచుకున్నాడని తెలుస్తుంది. నితిన్ కూడా మాచర్ల నియోజకవర్గం ఇచ్చిన షాక్ కి నెక్స్ట్ సినిమా తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే నితిన్ కూడా వెంకీ కి ఫుల్ సపోర్ట్ ఇచ్చేస్తున్నాడు.

ఆల్రెడీ హిట్ కాంబో కాబట్టి ఆ ర్యాపో నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. మరి నితిన్ వెంకీ ఎలాంటి సినిమాతో వస్తున్నారన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ గా నటిస్తే వెంకీ రష్మిక స్పెషల్ కాంబో అలా కొనసాగుతూనే ఉంటుందని చెప్పొచ్చు. ఈ క్రేజీ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారని తెలుస్తోంది.   


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.