Begin typing your search above and press return to search.

ఉస్తాద్ భగత్ సింగ్.. పూనకాలు తెచ్చే డైలాగ్

By:  Tupaki Desk   |   31 May 2023 10:22 AM GMT
ఉస్తాద్ భగత్ సింగ్.. పూనకాలు తెచ్చే డైలాగ్
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ కోసం హరీష్ శంకర్ కూడా రెండేళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేశారు.

ఇక హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ అంటే అందరికి గబ్బర్ సింగ్ గుర్తుకొస్తుంది. ఆ మూవీ దబాంగ్ రీమేక్ గా తెరకెక్కిన కూడా ఒరిజినల్ కంటే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రీమేక్ సినిమా అయిన కూడా తన బ్రాండ్ చూపించడం హరీష్ శంకర్ స్టైల్. ఆయన చివరిగా చేసిన గద్దలకొండ గణేష్ కూడా తమిళ్ హిట్ మూవీ జిగార్తాండకి రీమేక్. అయిన ఒరిజినల్ స్టొరీ లైన్ మాత్రమే తీసుకొని పెర్ఫెక్ట్ ఎలివేషన్ తో మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.

వరుణ్ తేజ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే గద్దలకొండ గణేష్ అని చెప్పాలి. ఇదిలా ఉంటే హరీష్ శంకర్ కి పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన పిచ్చి. తనని ఎలా అయితే ఫ్యాన్స్ చూడాలని కోరుకుంటారో అలా సిల్వర్ స్క్రీన్ పై చూపిస్తాడు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా అదే స్థాయిలో ప్రెజెంట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్ తో సినిమా ఎలా ఉండబోతోంది క్లారిటీ ఇచ్చేశాడు.

మరోసారి పవర్ స్టార్ అభిమానులకి పూనకాలు గ్యారెంటీ అని గ్లింప్స్ తోనే స్పష్టం అయిపొయింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి డైలాగ్ అంటూ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నువ్వేమన్నా గాంధీవ లేక భగత్ సింగ్ వా అంటే గాంధీ, భగత్ సింగ్ కాదురా అంతకు మించి భగవంతుడిని అంటూ చెప్పే డైలాగ్స్ ఫ్యాన్స్ కి గూస్ బాంబ్స్ తెప్పిస్తుందని ప్రచారం నడుస్తోంది.

అయితే ఈ డైలాగ్ ఉస్తాద్ మూవీలోంది కాదని కొందరి వాదన. అయిన, కాకున్నా కచ్చితంగా సినిమాలో పవర్ ఫుల్ డైలాగ్స్ మాత్రం పేలడం పక్కా అనే మాట వినిపిస్తోంది. అలాగే ఏపీ రాజకీయాలకి యాప్ట్ అయ్యే విధంగా కొన్ని ఇంటెన్సివ్ డైలాగ్స్ ని హరీష్ శంకర్ రాసారనే ప్రచారం నడుస్తోంది. మరి ఈ డైలాగ్స్ ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.