Begin typing your search above and press return to search.

బిగ్‌ బాస్‌ 6 : హోటల్ వర్సెస్ హోటల్‌ తుస్సుమంది

By:  Tupaki Desk   |   29 Sep 2022 9:32 AM GMT
బిగ్‌ బాస్‌ 6 : హోటల్ వర్సెస్ హోటల్‌ తుస్సుమంది
X
తెలుగు బిగ్ బాస్ 24వ రోజు కూడా హోటల్‌ వర్సెస్ హోటల్‌ టాస్క్ జరిగింది. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ అయిన ఈ టాస్క్ లో రెండు హోటల్స్ గా ఇంటి సభ్యులు విడిపోయిన విషయం తెల్సిందే. మొదటి లెవల్‌ టాస్క్ ముగిసే సమయంకు బిబి హోటల్‌ టీమ్‌ బిబి గ్లామ్‌ ప్యారడైజ్‌ హోటల్‌ టీమ్ చేతిలో ఓడిపోయారు.

మొదటి లెవల్‌ పూర్తి అయ్యే సమయంకు బిబి హోటల్ దగ్గర మొత్తం 4300 రూపాయలు మాత్రమే ఉన్నాయి. బిబి గ్లామ్ ప్యారడైజ్ వద్ద 5400 రూపాయలు ఉన్నాయి. దాంతో బిబి గ్లాం ప్యారడైజ్ టీమ్‌ టాస్క్‌లో విజయం సాధించారు. అంతే కాకుండా బిబి హోటల్‌ను కూడా సొంతం చేసుకున్నారు.

బిబి హోటల్‌ ని కొనుగోలు చేసిన తర్వాత ఆ హోటల్‌ నుండి కొంత మంది సిబ్బందిని తొలగించడం జరిగింది. రేవంత్‌ మరియు బాలాదిత్యలను తొలగిస్తున్నట్లుగా బిబి గ్లామ్‌ ప్యారడైజ్ టీమ్‌ వారు ప్రకటించారు. దాంతో వారు టాస్క్‌ నుండి బయటకు వెళ్లి పోవాల్సి వచ్చింది.

మొదటి టాస్క్ పూర్తి అయిన తర్వాత చంటికి మొదటి రోజు అప్పగించిన సీక్రెట్‌ టాస్క్‌ ఫలితాన్ని కూడా బిగ్‌ బాస్ ప్రకటించాడు. సీక్రెట్‌ టాస్క్ లో చంటి విఫలం అయ్యాడు.

ఆయన బిబి హోటల్ నుండి అతిథులు బిబి గ్లామ్ ప్యారడైజ్ హోటల్‌కి వెళ్లేలా చేయాల్సి ఉండగా చేయలేక పోయాడు. దాంతో ఆయన కూడా కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ నుండి ఔట్‌ అయ్యాడు.

ఇక లెవల్‌ 2 ని కూడా బిగ్‌ బాస్ ముగించేశాడు. లెవల్‌ 2 ముగిసే సమయంకు సూర్య.. ఇనాయ.. ఆది రెడ్డి. మరీనా లు జీరో రూపాయలతో ఉన్నారు. శ్రీహన్ వద్ద 3400 రూపాయలు... రాజశేఖర్ 6500 రూపాయలు... రోహిత్ 6100 రూపాయలు... గీతు 4500 రూపాయలు.. సుదీప 3600 రూపాయలు.. అర్జున్ 100 రూపాయలు కలిగి ఉన్నారు. ఈ టాస్క్ కి నేడు ఎపిసోడ్‌ లో ముగింపు ఉంటుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.