సీనియర్ హీరోల మధ్య.. హిట్టు కొట్టేలా వున్నాడే!

Fri Sep 30 2022 16:12:21 GMT+0530 (India Standard Time)

Update on Swathimutyam Movie Sensor Certificate

స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సోదరుడు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'స్వాతిముత్యం'. రొమాంటిక్ ఫన్ రైడ్ గా రూపొందిన ఈ మూవీ ద్వారా లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. సీరియస్ గా సాగుతూనే రొమాంటిక్ ఫన్ రైడ్ గా ఈ మూవీని దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ రూపొందించిన తీరు ఆకట్టుకుంటోంది.  

ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ నుంచే సినిమాపై అంచనాల్ని పోచేసిన చిత్ర బృందం టీజర్ ట్రైలర్ లతో మంచి మార్కులు కొట్టేసింది. అంతే కాకుండా సోదరుడు బెల్లంకొండ శ్రీనివాస్ తరహాలో ఊర మాస్ మసాలా యాక్షన్ డ్రామాని ఎంచుకోకుండా తొలి ప్రయత్నంగా సాఫ్ట్ గా సాగే రొమాంటిక్ లవ్ స్టోరీని బెల్లంకొండ గణేష్ ఎంచుకోవడం ఇండస్ట్రీ వర్గాలని విశేషంగా ఆకట్టుకుంది. ఈ మూవీని ఆక్టోబర్ 5న భారీ స్థాయిలో దసరా కానుకగా విడుదల కాబోతోంది.

ఇదే సమయంలో ఇద్దరు సీనియర్ హీరోలు మెగాస్టార్ నటించిన 'గాడ్ ఫాదర్' కింగ్ నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' రిలీజ్ కాబోతోంది. ఈ ఇద్దరు సీనియర్ హీరోల మధ్యలో యంగ్ హీరో బరిలోకి దిగుతున్నాడు.

దీంతో ఈ మూవీపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఇదిలా వుంటే సినిమా రిలీజ్ కి మరో ఐదు రోజులు మాత్రమే వుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని జోరుగా పెంచేసింది. ఇదే సందర్భంగా ఈ మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ ని శుక్రవారం పూర్తి చేశారు.

ఈ మూవీకి సెన్సార్ వారు యు/ఏ ఇచ్చారు. ఆద్యంత వినోదాత్మకంగా సాగే రొమాంటిక్ ఎంటర్ టైనర్ కావడంతో యు/ఏ లభించినట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ మరింతగా ఆకట్టుకుంటున్న నేపథ్యంలో ఇద్దరు సీనియర్ హీరోల మధ్య పోటీకి దిగుతున్న బెల్లంకొండ గణేష్ తొలి సినిమాతో రొమాంటిక్ హిట్ ని అందుకోవడం ఖాయం అని చెబుతున్నారు. సినిమాలోని కీలక పాత్రల్లో రావు రమేష్ వెన్నెల కిషోర్ హర్షవర్థన్ సురేఖా వాణి ప్రగతి తదితులు నటించారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.