బెల్లంకొండ ఛత్రపతి.. కష్టమే!

Thu Jan 26 2023 06:00:02 GMT+0530 (India Standard Time)

Update on Sreenivas Bellamkonda Chatrapathi

బెల్లకొండ సురేష్ తనయుడు.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లుడు శీను సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన ఇతడు... మాస్ హీరోగా మంచి పేరే తెచ్చుకున్నారు. అయితే భారీ బడ్జెట్ తో నిర్మించిన అల్లుడు శీను సినిమా.. బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. యావరేజ్ టాక్ తో నడిచింది. ఆ తర్వాత కూడా భారీ బడ్జెట్ లతో నిర్మించిన సినిమాల్లోనే బెల్లంకొండ హీరోగా నటించారు. మంచి సక్సెక్ సినిమా కోసం ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.రాక్షసుడు సినిమాతో పోలీస్ ఆఫీసర్ గా నటించి మెప్పించిన ఇతడు.. అల్లుడు అదుర్స్ సినిమాతో అట్టర్ ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత కచ్చితంగా హిట్టు కొట్టాలని భావించిన బెల్లంకొండ... టాలీవుడ్ కు బదులుగా బాలీవుడ్ కు వెళ్లిపోవాలనుకున్నాడు.

ఈ క్రమంలోనే ఓ మంచి సినిమాతో అక్కడ రాణించేందుకు ప్లాన్ వేశాడు. డార్లింగ్ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సినిమా సూపర్ డూపర్ హిట్టుగా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అదే సినిమాతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్.

ఈ సినిమాను రీమేక్ చేస్తూ.. షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. అయితే ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహించగా.. ఒరిజినల్ కథలో కొన్ని మార్పులు చేసి హిందీ ప్రేక్షకులకు నచ్చేలా చేసినట్లు సమాచారం. కీలక సన్నివేషాల్లో వి వి వినాయక్ మార్పులు చేసి స్క్రిప్టును మార్చారట.

ఒరిజినల్ సినిమా కంటే ఈ సినిమా సెకండ్ హాఫ్ లోని కొన్ని వేశాలను ఫాస్ట్ గా నడిచే కథలా మార్చారని కొన్ని కొత్త సన్నివేశాలను కూడా యాడ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే 2022 జనవరిలో సినిమా షూటింగ్ ప్రారంభించగా.. పూర్తయ్యేందుకు చాలానే సమయం తీసుకున్నారు.

దాదాపు ఏడాది తర్వాత సినిమా రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సిద్ధ అయింది. అయితే ముందుగా ఈ సినిమాని థియేటర్లలోనే విడుదల చేయాలనుకున్నప్పటికీ... ప్రస్తుతం ఓటీటీలోనే సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఓటీటీలోనే రిలీజ్ చేస్తే.. ఏ ప్లాట్ ఫాంలో ఎప్పుడు విడుదల చేయబోతున్నారు వంటి విషయాల గురించి మాత్రం ఇంకా తెలియదు.     నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.