Begin typing your search above and press return to search.

సిద్ధార్థ్ టక్కర్ ఇలా షాక్ ఇచ్చాడేంటి..?

By:  Tupaki Desk   |   10 Jun 2023 1:00 PM GMT
సిద్ధార్థ్ టక్కర్ ఇలా షాక్ ఇచ్చాడేంటి..?
X
లాస్ట్ ఇయర్ మహాసముద్రం తో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చాడు సిద్ధార్థ్. ఒకప్పుడు ఇక్కడ స్టార్ క్రేజ్ తెచ్చుకుని యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్న సిద్ధార్థ్ కొన్నాళ్లు కేవలం తమిళ సినిమాలే చేస్తూ కెరీర్ కొనసాగించాడు. మహా సముద్రం అనుకున్న విధంగా వర్క్ అవుట్ కాకపోయినా టక్కర్ తో హిట్ ట్రాక్ ఎక్కాలని చూశాడు. కానీ శుక్రవారం రిలీజైన టక్కర్ ఆడియన్స్ కి చుక్కలు చూపించేసిందని తెలుస్తుంది. సినిమా ఎక్కడ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయలేకపోయిందని చెబుతున్నారు.

సినిమా గురించి ఆహా ఓహో అంటూ సిద్ధార్థ్ చేసిన ప్రమోషన్స్ అంతా కూడా తుస్సుమనిపించాయి. సిద్ధార్థ్ ప్రమోషన్స్ లో చెప్పినవేవి సినిమాలో కనిపించలేదు. టక్కర్ సినిమాపై ఆడియన్స్ ఫోకస్ చేసేలా సిద్ధార్థ్ చేసిన ప్రమోషనల్ ప్రోగ్రామ్స్ అన్ని సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి.

కానీ ఎంత ప్రమోట్ చేసినా సినిమాలో విషయం లేకపోతే ఆడియన్స్ వారి ఇచ్చే రెస్పాన్స్ తెలిసిందే. ముఖ్యంగా సినిమాలో హీరోయిన్ పాత్ర గురించి సిద్ధార్థ్ కొద్దిగా ఎక్కువ చేసి చెప్పాడు. కానీ దివ్యాన్ష కౌశిక్ అంతగా ఏమి మెప్పించలేదని తెలుస్తుంది.

లవర్ బోయ్ గా ఉన్న సిద్ధార్థ్ తనని తాను మాస్ హీరోగా ప్రమోట్ చేసుకోవాలని అనుకున్నాడు. అలా ప్రయత్నించిన ప్రతిసారి సిద్ధార్థ్ కి ఎదురు దెబ్బలు తగిలాయి. ఆ క్రమంలోనే వచ్చిన టక్కర్ కూడా సిద్ధార్థ్ కి షాకింగ్ రిజల్ట్ ఇచ్చింది. ప్రమోషన్స్ ఎంత భారీగా చేసినా సినిమాలో మ్యాటర్ లేకపోతే ఏమి చేయలేని పరిస్థితి. సిద్ధార్థ్ ఈ సినిమాకు చేసిన ప్రమోషన్స్ ఓ రేంజ్ లో ఉంటే సినిమా టాక్ మాత్రం దానికి రివర్స్ లో ఉంది. ఓ విధంగా సిద్ధార్థ్ చేసిన ప్రమోషన్స్ కూడా సినిమాకు రివర్స్ అయ్యాయని చెప్పొచ్చు.

సిద్ధార్థ్ ఇంటర్వ్యూస్ చూసి సినిమాలో ఏదో సంథింగ్ స్పెషల్ ఉందని ఊహించి వెళ్లిన ఆడియన్స్ పూర్తిగా డిజప్పాయింట్ అయ్యేలా చేశాడు. ఇక ప్రస్తుత కాలంలో ఒక సినిమా బాగుంటే ఎంత స్పీడ్ గా పాజిటివ్ టాక్ వెళ్తుంటే బాగాలేదు అన్న టాక్ కూడా అంతే రేంజ్ లో ప్రేక్షకుల్లోకి వెళ్తుంది.

టక్కర్ సినిమా విషయంలో పబ్లిక్ టాక్ కూడా బాగాలేదు. మరి ఈ సినిమా కమర్షియల్ గా ఎలాంటి లెక్కలు తెస్తుందో చూడాలి. టక్కర్ తర్వాత కూడా సిద్ధార్థ్ ఇక వరుస తెలుగు సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇదివరకు తనని కలిసి కథ చెప్పిన డైరెక్టర్స్ అందరికి సిద్ధార్థ్ టచ్ లోకి వెళ్తున్నట్టు టాక్.