శాకుంతలం బిజినెస్.. గుణశేఖర్ అస్సలు తగ్గట్లేదు!

Fri Mar 31 2023 12:37:16 GMT+0530 (India Standard Time)

Update on Shakuntalam Business

విలక్షణ సినిమాలు తెరకెక్కించే గుణశేఖర్ ఇప్పుడు శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని మైతలాజికల్ థ్రిల్లర్ గా చెబుతున్నారు. దృశ్యంతుడు శకుంతల ప్రేమ కథగా ఈ సినిమాని తెరకెక్కించారు. గుణశేఖర్ ఈ సినిమాని గుణశేఖర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ఆయన కుమార్తె నీలిమ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.దిల్ రాజు ముందు నుంచి ఈ సినిమాకి ఫైనాన్స్ చేస్తూనే సినిమా కార్యక్రమాలు అన్నిట్లో భాగం అవుతూ వస్తున్నారు. ప్రస్తుతానికి దిల్ రాజు ఈ సినిమా అయినా సమర్పిస్తున్నారు. అదేవిధంగా తెలుగులో ఆయనే స్వయంగా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన నాన్ థియేటర్ రైట్స్ విషయంలో గుణశేఖర్ భారీగా లాభాలు ఆశిస్తున్నాడని తెలుస్తోంది.

 ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి శాటిలైట్ డీల్ ఫిక్స్ అవ్వలేదని అంటున్నారు. గుణశేఖర్ లెక్కల ప్రకారం ఈ సినిమాని తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ భాషలో సాటిలైట్ రైట్స్ ఒకేసారి క్లోజ్ చేయాలని భావిస్తున్నారు.

అయితే ఏ సంస్థ అయినా ఇన్ని భాషల సాటిలైట్ రైట్స్ కొనుక్కోవాలంటే ఇబ్బందిగానే ఫీలవుతోంది. దానికి కారణం గుణశేఖర్ చెబుతున్న రేట్లే.

గుణశేఖర్ ఈ విషయంలో పంతం వీడేలా కనిపించకపోవడంతో ఈ సాటిలైట్ డీల్ ని సినిమా రిలీజ్ కంటే ముందే క్లోజ్ చేయాలని దిల్ రాజు భావిస్తున్నాడు. ఒకవేళ సినిమా రిలీజ్ తర్వాత డివైడ్ టాక్ వస్తే ఈ విషయంలో ఇబ్బంది పడక తప్పదని దిల్ రాజు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించగా దేవి మోహన్ దుష్యంతుని పాత్రలో నటిస్తున్నాడు. ఇక ప్రకాష్ రాజ్ మోహన్ బాబు అనన్య నాగళ్ళ మధుబాల వంటి వారు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ భరతుడి పాత్రలో నటిస్తూ ఉండడం ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా మారింది. విజువల్ వండర్ గా త్రీడీలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.       


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.