Begin typing your search above and press return to search.
పాన్ ఇండియా రేస్ లోకి సత్యదేవ్!
By: Tupaki Desk | 26 Jan 2023 11:41 AMవిలక్షణమైన సినిమాలు, పాత్రలతో ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న హీరో సత్యదేవ్. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్'లో విలన్ గా నటించిన ఆ పాత్రలోనూ మంచి మార్కులు కొట్టేశాడు. ఈ సినిమా తరువాత సత్యదేవ్ కన్నడ నటుడు, 'పుష్ప' విలన్ డాలి ధనుంజయతో కలిసి తొలిసారి ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్ లపై ఎస్. ఎన్. రెడ్డి, బాల సుందరం, దినేష్ సుందరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సత్యదేవ్ నటిస్తున్న 26వ సినిమా ఇది. ఈ మూవీ ద్వారా ఈశ్వర్ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. క్రైమ్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీకి 'జీబ్రా' అనే టైటిట్ ని ఖరారు చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం టైటిల్ పోస్టర్ ని చిత్ర బృందం విడుదల చేసింది.
ధైర్య వంతులకే లక్ ఫేవర్ చేస్తుంది అనే క్యాప్షన్ ఆకట్టుకుంటోంది. చెస్ పీజెస్ వైట్ హార్స్ బ్లాక్ హార్స్ లని సింబాలిక్ గా చూపిస్తూ అలాంటి మనస్థత్వం వున్న ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే సమరం నేపథ్యంలో ఈ మూవీ వుండనుందని ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ తో మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు.
మధ్యలో జీబ్రా క్రాసింగ్ లైన్స్.. రెండువేల రూపాయల నోటు ఆకాశంలో ఎగురు తున్న ఫ్లైట్ .. టైటిల్ మద్యలో స్పీడో మీటర్ ని చూపించిన తీరు సినిమా ఓ రేంజ్ లో సరికొత్త నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. రేస్ సత్యదేవ్, డాలీ ధనుంజయ్ ల మధ్య సాగుతుందని వైట్ హార్స్ సత్యదేవ్ అయితే బ్లాక్ హార్స్ గా ధనుంజయ్ పాత్ర వుంటుందని ఫస్ట్ లుక్ పోస్ట్ తో తెలుస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి 'కేజీఎఫ్' ఫేమ్ రవి బాస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.
ప్రియా భవానీ శంకర్, జెన్నీఫర్ పిసినాటో హీరోయిన్ లు గా నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రల్లో సత్యరాజ్, సత్య ఆకల, సునీల్ నటిస్తున్నారు. మొదటి షెడ్యూల్ ని చిత్ర బృందం పూర్తి చేసింది. 50 రోజుల్లో ఫస్ట్ షెడ్యూల్ ని పలు కీలక ఘట్టాలతో పూర్తి చేశారు. కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో పాటు సలార్ కు సంగీతం అందిస్తున్న రవి బాస్రూర్ ఈ మూవీ సంగీతం అందిస్తున్నారని, ఆయన అందించే సంగీతం సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలుస్తుందని నిర్మాతలు చెబుతున్నారు.
సుమన్ ప్రసర్ బాగే సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 'గాడ్ ఫాదర్'తో నటుడిగా మరింత ఫేమ్ ని సొంతం చేసుకున్న సత్యదేవ్ ఈ మూవీతో హీరో గా పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపుని సొంతం చేసుకోవాలనే ఆలోచనలో వున్నట్టుగా తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.