సమంత సినిమా రిలీజ్ డేట్ గందరగోళం కంటిన్యూ

Sun Aug 14 2022 17:01:40 GMT+0530 (India Standard Time)

Update on Samantha Films Release Date

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల నటించిన యశోద మరియు శాకుంతలం సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వస్తాయి అనుకుంటే ఆ రెండు సినిమాలు ఎప్పుడు వచ్చేది క్లారిటీ లేకుండా ఉంది. శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి అయ్యి చాలా నెలలు అవుతుంది. అయినా కూడా ఇప్పటి వరకు విడుదల తేదీ విషయంలో ఎలాంటి ప్రకటన రాలేదు.యశోద సినిమా విడుదల తేదీని ఇప్పటికే ఆగస్టు 12వ తారీకున విడుదల చేయాలని నిర్ణయించి.. అధికారికంగా ప్రకటన కూడా చేయడం జరిగింది. కానీ సినిమా ను అనుకున్న తేదీకి విడుదల చేయలేక పోతున్నాం అంటూ ఇటీవల యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. సినిమా విడుదల తేదీ విషయంలో గందరగోళం నెలకొంది. ఆగస్టు లో విడుదల కాని సినిమా ను సెప్టెంబర్ కి వాయిదా వేసినట్లుగా వార్తలు వచ్చాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ లో అయినా ఈ సినిమా విడుదల అయ్యేది అనుమానమే అన్నట్లుగా పరిస్థితి ఉంది అంటున్నారు. సమంత ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసినా కూడా ఎందుకు విడుదల ఆలస్యం అవుతుందో అర్థం కావడం లేదు అంటూ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రాఫిక్స్ వర్క్ విషయంలో రాజీ పడకపోవడం వల్ల విడుదల ఆలస్యం అవుతుందనే వార్తలు వస్తున్నాయి.

యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా లో సమంతతో పాటు తమిళ నటి వరలక్ష్మి మరియు ఉన్ని ముకుందన్ లు కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

ఈ సినిమా కు దర్శక ద్వయం హరి హరీష్ లు దర్శకత్వం వహించారు. షూటింగ్ చాలా స్పీడ్ గా పూర్తి చేసిన యశోద యూనిట్ సభ్యులు గ్రాఫిక్స్ వర్క్ విషయంలో ఆలస్యం వల్ల విడుదల వాయిదా వేయడం జరిగిందని అంటున్నారు.

కొత్త విడుదల తేదీ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో అభిమానులు మరియు ప్రేక్షకులు గందరగోళంలో ఉన్నారు. సమంత నటించిన శాకుంతలం మరియు యశోద రెండు సినిమాల పరిస్థితి కూడా ఇలాగే ఉండటంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో కనీసం ఒక్కటైనా ఈ ఏడాది విడుదల అయ్యేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.