Begin typing your search above and press return to search.

హమ్మయ్య సలార్ సర్‌ప్రైజ్ వచ్చేస్తోంది

By:  Tupaki Desk   |   13 Aug 2022 10:42 AM GMT
హమ్మయ్య సలార్ సర్‌ప్రైజ్ వచ్చేస్తోంది
X
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాపై హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంచనాలు ఎంతవరకు వెళ్లాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేజిఎఫ్ సినిమాలతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరపైకి వస్తున్న ఈ సినిమా మామూలుగా ఉండదు అని ఇప్పటికే అభిమానులు ఊహల్లో తేలిపోతున్నారు. ఇదివరకే ప్రభాస్ వరుసగా రెండు సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అందుకోవడంతో ఇప్పుడు అందరి ఫోకస్ కూడా ఇదే సినిమాపై పడింది.

సలార్ సినిమా కంటే ముందుగానే ఆదిపురుష్ వస్తున్నప్పటికీ కూడా ఇదే కంప్లీట్ మాస్ సినిమా కాబట్టి యాక్షన్ ప్రియులు మాత్రం ఈ సినిమానే ముందు వస్తే చూడాలని అనుకుంటున్నారు.

అయితే సినిమాకు సంబంధించిన అప్డేట్ విషయంలో మాత్రం ఇటీవల చిత్ర యూనిట్ సభ్యులు చాలా ఆలస్యం చేస్తున్నారు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. వీలైనంత త్వరగా అప్డేట్ ఇవ్వాలి అని కూడా సోషల్ మీడియాలో చాలామంది అభిమానులు రిక్వెస్ట్ చేశారు.

ఇక ఎట్టకేలకు చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్ గా ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ను ఆగస్టు 15వ తేదీన తెలియజేయబోతున్నట్లు వివరణ ఇచ్చారు. అందుకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పోస్టర్ కూడా విడుదల చేశారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ సోమవారం మధ్యాహ్నం 12:58కి సినిమా అనౌన్స్మెంట్ ఉంటుంది అని వివరణ ఇచ్చారు.

దీంతో అభిమానులు ఒక్కసారిగా సంతోషంగా మునిగిపోతున్నారు తప్పకుండా విడుదల తేదీ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఒక పవర్ఫుల్ టీజర్ కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లు ఇదివరకే ఒక టాక్ అయితే వచ్చింది. ఇక అంతే కాకుండా రెండు భాగాల్లో కూడా వస్తుంది అని అన్నారు. మరి దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమా ద్వారా ప్రభాస్ ను ఎలా ప్రజెంట్ చేస్తాడో చూడాలి.