సలార్కు దిమ్మ తిరిగే డిమాండ్

Fri Mar 17 2023 13:14:33 GMT+0530 (India Standard Time)

Update on Salaar Movie Business

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ దారుణమైన ఫలితాలు అందుకుంటున్న నేపథ్యంలో ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో గురించి ఎక్కువగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందా అంటే అది సలార్ అని చెప్పక తప్పదు. కేజీఎఫ్ సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండడం... ప్రభాస్ మునుపేన్నడు విధంగా ఒక యాంగ్రీ లుక్లో కనిపిస్తాడనే ప్రచారం జరుగుతూ ఉండడంతో పాటు ఈ సినిమాలో నటిస్తున్న నటీ నటులు కూడా సినిమా మీద ఆసక్తి పెంచేస్తున్నారు.ఇప్పటికే జగపతి బాబు ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడని విషయం మీద క్లారిటీ వచ్చేసింది. ఆయన కుమారుడు పాత్రలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ నటిస్తూ ఉండడం కూడా సినిమా మీద అంతకంతకు ఆసక్తి పెంచేస్తోంది.

పాన్ ఇండియా లెవెల్లో తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ భాషల్లో విడుదలబోతున్న ఈ సినిమా హక్కుల కోసం గట్టి డిమాండ్ ఏర్పడిందని అంటున్నారు. ఇక తాజాగా ఈ సినిమా హక్కుల విషయంలో గట్టి డిమాండ్ ఏర్పడిందని అంటున్నారు.

 కేవలం ఆంధ్ర ప్రదేశ్ రీజియన్ రైట్స్ 100 కోట్ల రూపాయలకు అమ్మాలని అంచనా వేస్తున్నారు మేకర్స్. డీల్ ఇంకా క్లోజ్ కాలేదు కానీ 100 కోట్ల రూపాయలను నిర్మాతలు ఏపీ హక్కుల కోసం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ రేటు ప్రకారం చూస్తే ఈ సినిమాకు సంబంధించిన ప్రపంచ వ్యాప్త థియేట్రికల్ రైట్స్ 200 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా చూస్తే ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ఈ థియేటర్ రైట్స్ క్లారిటీ ఇచ్చేస్తున్నాయని అంటున్నారు.

శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో కేజీఎఫ్ హీరో యష్ కూడా కనిపించబోతున్నాడు అనే ప్రచారం జరుగుతోంది. క్లైమాక్స్లో యశ్ ఎంట్రీ ఉంటుందని చెబుతూ ఉండడంతో సినిమా మీద అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. కేజీఎఫ్ సలార్ సినిమాలకు కనెక్షన్ ఉంటుందనే ప్రచారాలు కూడా వస్తున్నాయి. వీటిలో ఎంత నిజం ఉందనేది సినిమా రిలీజ్ అయ్యే వరకు ఓపిక పట్టాల్సిందే.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.