Begin typing your search above and press return to search.

SSMB 28: ఓవర్సీస్ లో అదిరిపోయే డీల్

By:  Tupaki Desk   |   1 April 2023 10:23 AM GMT
SSMB 28: ఓవర్సీస్ లో అదిరిపోయే డీల్
X
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ త్రివిక్రమ్ గత సినిమాల స్టైల్ లోనే ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఉండబోతూ ఉందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి ఫెస్టివల్ కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. పల్నాడు బ్యాక్ డ్రాప్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ లో మాస్ ఆడియన్స్ కు రీచ్ అయ్యి అంశాలు పుష్కలంగా ఉంటాయని సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో మూవీ చేయనున్నారు.

ఆ సినిమా రిలీజ్ కావడానికి కనీసం రెండు సంవత్సరాల టైమ్ పడుతుంది ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాలని మహేష్ బాబు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇదివరకు వచ్చిన అతడు, ఖలేజా సినిమాలకు భిన్నంగా ఈ మూవీ ఉండబోతుందని పోస్టర్ తోనే క్లారిటీ వచ్చేసింది.

మహేష్ నుంచి ఆడియన్స్ కోరుకునే ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్ అంశాలు కూడా పుష్కలంగా ఉండే విధంగా త్రివిక్రమ్ కథని సిద్ధం చేశారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓవర్సీస్ రైట్స్ కూడా అమ్ముడైపోయినట్లుగా తెలుస్తుంది. అమెరికాలో 14.50 కోట్లకు ఈ సినిమా రైట్స్ ను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సొంతం చేసుకున్నారు.

నాలుగు మిలియన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. టోటల్ గా ఓవర్సీస్ రైట్స్ ద్వారా 22 నుంచి 24 కోట్లు ఈ సినిమాకి వచ్చేసినట్లుగా సమాచారం. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోనే హైయెస్ట్ ఓవర్సీస్ రైట్స్ ని ఈ సినిమా దక్కించుకోవడం విశేషం. మరి నాలుగు మిలియన్స్ టార్గెట్ తో సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోయే సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.