పుష్ప 2 డిజిటల్ రైట్స్.. డిమాండ్ గట్టిగానే ఉందే!

Sat Apr 01 2023 10:33:50 GMT+0530 (India Standard Time)

Update on Pushpa 2 Digital Rights

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతూ ఉన్న సినిమా పుష్ప 2. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతూ ఉంది. పుష్పకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ హైప్ ఉంది. మొదటి సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్ట్ చేయడంతో పుష్ప2 తో 1000 కోట్ల గ్రాస్స్ కలెక్షన్స్ అందుకోవాలని లక్ష్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెట్టుకున్నారు.దానికి తగ్గట్లుగానే ఈ సినిమాలో మాస్ అంశాలు పుష్కలంగా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ని డిజైన్ చేస్తూ ఉండటం విశేషం. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ ని  రెడ్ శాండిల్ డాన్ గా చూపించబోతున్నారు.

ఈ నేపథ్యంలో దానికి తగ్గట్లుగానే స్టోరీ ఎలివేషన్ పవర్ ఫుల్ హీరోయిజం ఉండబోతుంది. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది వేసవి వినోదంగా ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సలహాలు చేస్తూ ఉన్నారు.

ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి స్పెషల్ ప్రోమో రిలీజ్ చేసే ప్లానింగ్ జరుగుతూ ఉంది. కేవలం అల్లు అర్జున్ మీద మాత్రమే ఎలివేషన్స్ షాట్స్ తో ఈ ప్రోమోని ప్రత్యేకంగా డిజైన్ చేయబోతున్నట్లుగా టాక్. ఇక ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ కూడా ప్రస్తుతం జరుగుతుందని ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉన్న మాట.

 సినిమా డిజిటల్ రైట్స్ కోసం ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ పోటీపడుతుంది. ఇప్పటికే టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాలను వరుస పెట్టి డిజిటల్ రేట్స్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంటున్నారు. పుష్ప 2 కోసం ఏకంగా నిర్మాతలు డిజిటల్ రైట్స్ ని 200 కోట్లు కోట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నెట్ ఫ్లిక్స్ ప్రస్తుతం నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతుందని తెలుస్తూ ఉంది.

మరి నిర్మాతలు డిమాండ్ చేస్తున్న స్థాయిలో 200 కోట్లు ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉంటారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ స్థాయిలో ఇస్తే మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో పుష్ప 2 డిజిటల్ రైట్స్ సంచలనంగా మారుతాయి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక దేశవ్యాప్తంగా ఈ సినిమాకి బజ్ ఉండడంతో అన్ని భాషలలో కలిపి ఈ డిజిటల్ రైట్స్ 200 కోట్ల మేరకు నిర్మాతలు డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.