Begin typing your search above and press return to search.
పాన్ ఇండియా స్టార్ ఆ విషయంలో తగ్గేదేలే?
By: Tupaki Desk | 1 Feb 2023 6:00 AMటాలీవుడ్‌లో ప్రస్తుతం ఏ స్టార్ హీరో కూడా ఖాలీగా లేడు. చివరికి వరుస ఫ్లాపుల్లో వున్న హీరోల చేతుల్లో కూడా బ్యాక్ టు బ్యాక్ రెండు మూడు ప్రాజెక్ట్ లున్నాయి. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభాస్ ఇప్పటికే తన కెరీర్ లో తొలి మైథలాజికల్ డ్రామా 'ఆది పురుష్' షూటింగ్ ని పూర్తి చేసి ఇతర సినిమాలపై దృష్టి సారించాడు. ప్రస్తుతం ప్రభాస్ మూడు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న విషయం తెలిసిందే.
'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో 'సలార్', నాగ్ అశ్విన్ అత్యంత భారీ స్థాయిలో టైమ్ ట్రావెల్ కథతో రూపొందిస్తున్న సైన్స్ ఫిక్షన్ 'ప్రాజెక్ట్ కె'తో పాటు మారుతి తెరకెక్కిస్తున్న హారర్ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. రెండు భారీ సినిమాలకు డేట్స్ కేటాయిస్తూనే మధ్య మధ్యలో అవకాశం చిక్కిన ప్రతీ సారి మారుతి సినిమాకు కేటాయిస్తూ పరుగులు పెట్టిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ క్రేజీ ప్రాజెక్ట్ ల షూటింగ్ ప్యారలల్ గా జరుగుతోంది.
ఇదిలా వుంటే ఇందులో ఒక్కో ప్రాజెక్ట్ కు ప్రభాస్ వంద కోట్లు ఛార్జ్ చేసతున్నాడట. అయితే తాజాగా తన పంథాని ప్రభాస్ మార్చుకున్నారని, వంద కోట్లకు మించి రెమ్యునరేషన్ ని డిమాండ్ చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్.
ఈ మూడు సినిమాల తరువాత ప్రభాస్ 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగతో కలిసి 'స్పిరిట్' మూవీని చేయబోతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సిద్ధార్ధ్ ఆనంద్ తోనూ ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
రీసెంట్ గా సిద్ధార్ద్ ఆనంద్ 'పఠాన్'తో బ్లాక్ బస్టర్ హిట్ ని దక్కించుకుని బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతున్న విషయం తెలిసిందే. వారం తిరక్కుండానే షారుక్ నటించిన 'పఠాన్' 500 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. రానున్న రోజుల్లో ఆ ఫిగర్ మరింతగా మారే అవకాశం వుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ తో సిద్దార్ధ్ ఆనంద్ చేయబోతున్న ప్రాజెక్ట్ చర్చనీయాంశంగా మారింది.
హృతిక్ రోషన్ కూడా కీలక పాత్రలో నటించనున్న ఈ మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ కంపనీ మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ మూవీని 2025 లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అయితే ఈ మూవీ కోసం ప్రభాస్ తన పారితోషికంగా 150 కోట్లు డిమాండ్ చేసతున్నాడని, తన మార్కెట్ వ్యాల్యూని బట్టి ఈ స్థాయిలో ప్రభాస్ డిమాండ్ చేస్తున్నాడని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.