ప్రభాస్ మారుతి.. మొత్తానికి నోరువిప్పారు

Fri Mar 17 2023 09:31:49 GMT+0530 (India Standard Time)

Update on Prabhas Maruthi Film

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజా డీలాక్స్ అనే వర్క్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో మాళవిక మోహనన్ నిధి అగర్వాల్ ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కంప్లీట్ గా ఒక బంగ్లాలో జరిగే కథగా దీనిని ఆవిష్కరిస్తున్నారు. హర్రర్ కామెడీ జోనర్ లో ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ చేయడంతో ఈ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇదిలా ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు  ఓ చిన్న అప్డేట్ కూడా బయటకి రాలేదు.

ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో దీనికోసం డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మారుతిని ట్రోల్ కూడా చేశారు. అయితే సినిమా గురించి అప్డేట్ మాత్రం ఇవ్వలేదు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నిర్మాత వివేక్ కూచిబోట్లని పలానా అబ్బాయి పలానా అమ్మాయి మూవీ ప్రమోషన్ లో భాగంగా విలేకరులు ఈ సినిమా గురించి అప్డేట్ అడిగారు. అలాగే పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న వినోదాయ సీతమ్ మూవీకి సంబందించిన అప్డేట్స్ ఏంటి అని అడిగారు.

అయితే వీటిపై నిర్మాత ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. వాటికి సంబందించిన అప్డేట్ ఇవ్వడానికి రైట్ టైమ్ కోసం చూస్తున్నామని రైట్ టైమ్ వచ్చినపుడు కచ్చితంగా చెబుతాం అంటూ చెప్పారు.

 దీనిని బట్టి ప్రభాస్ మారుతి సినిమా అప్డేట్ కి రైట్ టైమ్ రాలేదని చెప్పేశాడు. అలాగే పవన్ కళ్యాణ్ తేజ్ మూవీకి సంబంధించి కూడా ఎలాంటి అప్డేట్ ని ఇవ్వడానికి సిద్ధంగా లేనని క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాలకి సంబందించిన అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూసూ ఉండటం విశేషం. మరి నిర్మాత చెప్పిన ఆ రైట్ టైమ్ ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు ఫ్యాన్స్ ప్రశ్నగా ఉంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.