పవన్ - సుజీత్ మూవీ... రెండు వైపుల బ్యాడ్ సెంటిమెంట్స్

Mon Dec 05 2022 14:26:56 GMT+0530 (India Standard Time)

Update on PawanKalyan And Sujeeth Movie

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న హరి హరి వీరమల్లు సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా విషయంలో ఒక స్పష్టత వచ్చింది. సాహో చిత్ర దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా ను దానయ్య అధికారికంగా ప్రకటించాడు.



హరిష్ శంకర్ సినిమా ఇంకా మొదలు పెట్టక ముందే సుజీత్ దర్శకత్వంలో సినిమా ను ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది. ఇదే సమయంలో ఈ సినిమా గురించి రకరకాలుగా నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. పవన్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం అంటూ ఉండగా మరి కొందరు మాత్రం రెండు వైపుల బ్యాడ్ సెంటిమెంట్స్ అంటూ ఉన్నారు.

గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందబోతుందని ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అనే టైటిల్ తో ఈ సినిమా రాబోతుందని ప్రచారం జరుగుతోంది. పవన్ గతంలో గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. ముఖ్యంగా చాలా అంచనాల నడుమ వచ్చిన పంజా యొక్క పరిస్థితి ఏంటో అందరికీ తెల్సిందే.

మరో వైపు సునీత్ దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్ స్టర్ మూవీ సాహో కూడా నిరాశ పరిచింది. బాలీవుడ్ లో గౌరవ ప్రథమైన కలెక్షన్స్ రావడం వల్ల పరువు నిలిచింది. కానీ అక్కడ కూడా నిరాశ పర్చితే సాహో సినిమా అతి పెద్ద డిజాస్టర్ అయ్యేది. సాహో సినిమా ఇక్కడ నిరాశ పరచడం వల్లే సుజీత్ కు ఇప్పటి వరకు మరో సినిమా ఆఫర్ రాలేదు అనేది టాక్.

ఎట్టకేలకు పవన్ నుండి సుజీత్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. వీరిద్దరు కూడా గ్యాంగ్ స్టర్ సినిమాల విషయంలో నిరాశ పర్చారు. ఇద్దరికి ఇద్దరు కూడా గ్యాంగ్ స్టర్ సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు వీరి కాంబోలో సినిమా రావడం విడ్డూరంగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.