Begin typing your search above and press return to search.

పఠాన్ ఓటీటీ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్

By:  Tupaki Desk   |   30 Jan 2023 3:00 PM GMT
పఠాన్ ఓటీటీ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్
X
ఇప్పుడు బాలీవుడ్ 'పఠాన్' ఫీవర్‌తో ఊగిపోతున్న సంగతి తెలిసిందే. మొదటి రోజే హిట్‌ టాక్‌ తెచ్చుకున్న బాద్‌షా షారూఖ్ ఖాన్ సినిమా... బాక్స్ ఆఫీసు వద్ద వసూళ్ల సునామీ కురిపిస్తోంది. షారుఖ్‌ హీరోగా దీపికా పదేకొణె హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ మొదటి రోజు ఒక్క హిందీ బెల్ట్‌లోనే 55 కోట్ల రూపాయల వరకూ నెట్‌ కలెక్సన్లను వసూలు చేసింది. భారీ అంచనాల మధ్య అత్యంత భారీ స్క్రీన్ లలో రిలీజ్ అయిన ఈ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా డే 1 నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో షారుఖ్ అభిమానులు మాత్రమే కాదు... బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం చాలా రోజుల తర్వాత వచ్చిన విజయాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తున్నారు. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చితం.. ఆదివారం నాటికి వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. బాద్‌షా స్టామినా ఏంటో బాక్స్ ఆఫీస్ కి మరోసారి చూపిస్తోంది ఈ సినిమా.

ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటీటి హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఏప్రియల్ 25, 2023 న ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 - 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు సమాచారం.

అయితే తాజాగా ఇంకో విషయం బయటకు వచ్చింది. షారుక్ పఠాన్ సినిమా ఓటీటీలో విడుదల ఆలస్యం అవుతుంది అని సమాచారం. ఎందుకంటే పఠాన్ సినిమాకు రోజు రోజుకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఈ సినిమా ఇంకా థియేటర్స్ లోనే ఉంచాలి అని భావిస్తున్నారట మేకర్స్. అయితే ఈ కలెక్షన్స్ జోరు ఇలాగే సాగితే ఓటీటీ రిలీజ్ ఆలస్యం అవుతుంది అనడంలో సందేహం లేదు.

ఇక ఈ సినిమా దాదాపు 8000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అలాగే బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్‌ను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. దీంతో ఈ మూవీ. ఈ చిత్రాన్ని యాష్ రాజ్ ఫిలిమ్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాలో జాన్ అబ్రహం కీలక పాత్ర పోషించాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.