పఠాన్ అడ్వాన్స్ బుకింగ్స్.. 50 కొట్టేశాడు

Tue Jan 24 2023 11:48:01 GMT+0530 (India Standard Time)

Update on Pathaan Advance Bookings

సుదీర్ఘకాలం గ్యాప్ తీసుకున్న షారుఖ్ ఖాన్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. పఠాన్ అనే సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జనవరి 25వ తేదీన ఈ సినిమాని పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నారు మేకర్స్. కేవలం హిందీలోనే కాదు... తమిళ తెలుగు భాషల్లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది.వాస్తవానికి చాలా తెలివిగా పఠాన్ టీం 25వ తేదీ డేట్ లాక్ చేసుకుంది. ఎందుకంటే షారుఖ్ ఖాన్ అభిమానులు 25వ తేదీ రిలీజ్ చేసిన థియేటర్లకు వస్తారు. తర్వాత 26వ తేదీ నేషనల్ హాలిడే కావడంతో ప్రేక్షకులు తమ సినిమా మీద ఆసక్తి చూపించే అవకాశం ఉందని మేకర్స్ భావించారు.

ఆ తర్వాత 27 నుంచి వీకెండ్ మొదలవుతూ ఉండడంతో సినిమా మీద వసూళ్ల వర్షం కురుస్తుందని ఆశించారు. అయితే వారు ఆశించిన మేరకే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్స్ కూడా కనిపిస్తున్నాయి.

తాజాగా విడుదలైన పటాన్ అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్ గనుక మనం పరిశీలిస్తే.. మొదటి రోజు ఈ సినిమాని చూసుకునే చూసేందుకు ఏడు లక్షల 65 వేల 251 టికెట్లు అమ్ముడయ్యాయి. రెండో రోజు అయితే ఏకంగా 45562 టికెట్లు అమ్ముడయ్యాయి.

ఇక తర్వాతి రోజుల్లో సినిమా చూసేందుకు 582987 టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇక అలా మొదటి రోజు 23 లక్షల పదహారు కోట్లు రెండవ రోజు 13 కోట్ల 38 లక్షలు మూడవ తర్వాత రోజుల్లో 13 కోట్ల 92 లక్షలు మేర గ్రాస్ వసూళ్లు రాబడ్డాయి.

మొత్తం ఇప్పటివరకు 18 లక్షల 380 టికెట్లు అమ్ముడు అయితే 50 కోట్ల 46 లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. సిద్ధార్థ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారుక్ ఖాన్ ఒక రా ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు దీపికా పడుకొనే జాన్ అబ్రహం కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని ఆదిత్య చోప్రా యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ మీద తెరకెక్కించారు. సుమారు 250 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.      నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.