Begin typing your search above and press return to search.

నాని 30.. ఓ పనైపోయింది!

By:  Tupaki Desk   |   30 May 2023 9:34 AM GMT
నాని 30.. ఓ పనైపోయింది!
X
నేచురల్ స్టార్ నాని తాజాగా దసరా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకొని మంచి జోష్ మీద ఉన్నారు. దసరా రిలీజ్ కి ముందే శౌర్యువ్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ కి కూడా ఎనౌన్స్ చేశారు. అలాగే షూటింగ్ స్టార్ట్ చేసేశారు. దసరా సక్సెస్ ని కొద్ది రోజులు ఎంజాయ్ చేసిన నాని ప్రస్తుతం నాని30 మూవీని కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరిగింది.

తాజాగా ముంబై షెడ్యూల్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో హీరో నాని, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పై కీలక సన్నివేశాలు తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తాజాగా నాని, మృణాల్ తో పాటు మరికొంత మంది క్రూ కలిసి దిగిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ముంబై షెడ్యూల్ కంప్లీట్ అయిన సందర్భంగా ఈ ఫోటోని తీసుకున్నట్లు తెలుస్తోంది.

మృణాల్ ఠాకూర్ ఈ ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకొని ముంబైలో నాని 30 షెడ్యూల్ పూర్తయిందని పేర్కొంది. చాలా జ్ఞాపకాలతో ఈ రోజు షెడ్యూల్ పూర్తి చేసుకున్నాం.

మొదటి సారి ముంబైలో ఒక సౌత్ సినిమా షూటింగ్ ని పాల్గొనడం చాలా హ్యాపీగా అనిపించింది అంటూ ఇంటరెస్టింగ్ ఫోటోలని మృణాల్ ఠాకూర్ పంచుకున్నారు. ఈ ఫోటోలని ఇన్ స్టాలో ఏకంగా 3.32 లక్షల మంది లైక్ చేయడం విశేషం.

ఇదిలా ఉంటే నాని30 మూవీ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ కథాంశం ఉండబోతోంది అని ఆరంభంలోనే క్లారిటీ ఇచ్చేశారు. జెర్సీ సినిమా తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో తెరకెక్కింది. ఇప్పుడు కూతురుతో బాండింగ్ ని నేచురల్ స్టార్ నాని చూపించబోతున్నారు.

ఈ సినిమాకి హేసమ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. విజయ్ దేవరకొండ, సమంత ఖుషి మూవీతో ఇతను టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు. నాని30 సెకండ్ మూవీగా వస్తోంది. ఇక మృణాల్ షేర్ చేసిన ఫోటోలకి అబ్దుల్ వాహబ్ కూడా రెప్లై ఇవ్వడం విశేషం.