నాగార్జున-రాజశేఖర్ కాంబోలో… ఎప్పుడంటే?

Mon Feb 06 2023 16:00:01 GMT+0530 (India Standard Time)

Update on Nagarjuna And Rajasekar Combo

కింగ్ నాగార్జున ప్రస్తుతం తనదైన శైలిలో తనకి సెట్ అయ్యే కథలని ఎంపిక చేసుకొని సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది ది ఘోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన నాగార్జున ప్రస్తుతం ప్రసన్నకుమార్ బెజవాడ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఒకే చెప్పాడు. త్వరలో ఈ మూవీ అఫీషియల్ గా ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ కూడా అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. హీరోగా కెరియర్ క్లోజ్ అయ్యే పరిస్థితిలో ఉండటంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు.

 అయితే సరైన సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్ ప్రాజెక్ట్ పడితే తన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ కావడానికి గ్రాండ్ గా ఉంటుంది అని భావిస్తున్నాడు. మరో వైపు కొత్త దర్శకుల కథలు వింటున్నట్లు తెలుస్తుంది.

అయితే మార్కెట్ పరంగా రాజశేఖర్ సినిమాలు థియేటర్స్ లో ప్రస్తుతం ఆడటం లేదు. ఇదిలా ఉంటే 15 ఏళ్ళ వెనక్కి వెళ్తే రాజశేఖర్ స్టార్ హీరోగా వరుస సక్సెస్ లు అందుకుంటూ దూసుకుపోయాడు అని చెప్పాలి. డిఫరెంట్ కంటెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు. ఇక నాగార్జున కూడా సక్సెస్ ఫుల్ కెరియర్ ని కొనసాగించాడు.

 ఆ సమయంలోనే వీరిద్దరి కాంబినేషన్ లో బిగ్ మల్టీ స్టారర్ మూవీ స్టార్ట్ అయ్యిందనే విషయం చాలా మందికి తెలియదు. అయితే ఈ కాంబినేషన్ మూవీని ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో ప్లాన్ చేశారు. ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇక వెంకట్ అక్కినేని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించడానికి రెడీ అయ్యారు. కథ కూడా ఫైనల్ అయ్యింది. ఇక క్యాస్టింగ్ సెలక్షన్ చేసుకొని సెట్స్ పైకి వెళ్తామని అనుకున్నారు

. అయితే ఏవో కారణాల వలన ఈ కాంబినేషన్ వర్క్ అవుట్ కాదని ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేసారు. తరువాత నాగార్జునతో ఈవీవీ సినిమాలు చేసి హిట్స్ కొట్టాడు కాని రాజశేఖర్ తో మాత్రం కెరియర్ లో ఒక్క సినిమా మాత్రమే చేసాడు. అది కూడా డిజాస్టర్ అయ్యింది. ఏది ఏమైనా నాగార్జున రాజశేఖర్ కాంబినేషన్ లో రావాల్సిన బిగ్ మల్టీస్టారర్ మూవీ ఆ రోజుల్లో ఎందుకు ఆగిపోయింది అనేది ఎవరికి తెలియదు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.