Begin typing your search above and press return to search.
NBK బర్త్ డే గిఫ్ట్.. ఫ్యాన్స్ కి ముందుంది అసలు పండగ!
By: Tupaki Desk | 30 May 2023 9:02 AMనటసింహా నందమూరి బాలకృష్ణ పవర్ ప్యాక్డ్ పెర్ఫామర్ గా మాస్ హృదయాల్ని ఏల్తున్నాడు. అందుకు తగ్గట్టే బాలయ్య కోసం ఎంపిక చేసే టైటిల్స్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటాయి. సమర సింహారెడ్డి- నరసింహానాయుడు- చెన్న కేశవ రెడ్డి- వీరసింహారెడ్డి .. ఇవన్నీ ఒక ట్రెండ్. ఆ తర్వాత సింహా-అఖండ లాంటి బ్లాక్ బస్టర్లు కెరీర్ లో ఉన్నాయి. ఇటీవల విడుదలైన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లను సాధించిందంటే ఎంపిక చేసిన పవర్ ఫుల్ టైటిల్ వల్లనే.
అఖండ- వీరసింహారెడ్డి సహా చాలా సినిమాలకు తన పాత్రల పేర్లనే టైటిల్స్ గా పెట్టుకున్నారు ఎన్బీకే. ఆయన వీర రసాన్ని టైటిల్ లోకి తెచ్చేందుకు మన దర్శకులు కూడా ఉవ్విళ్లూరుతుంటారు. ఇప్పుడు అనీల్ రావిపూడి అందుకు మినహాయింపు కానే కాదు. ఎఫ్ 2 లాంటి ఫన్ తో కూడుకున్న టైటిల్ ని ఎంపిక చేసుకున్న అతడు ఈసారి బాలయ్య కోసం పూర్తిగా ఫార్ములా మార్చాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎంపిక చేసుకున్న కథలో వినోదాన్ని మించి భారీ యాక్షన్ ఉంటుందని బాలయ్య మాస్ ఇమేజ్ కి తగ్గ సన్నివేశాలతో పంచ్ లతో ప్రతి ఫ్రేమ్ అలరించేలా అనీల్ రావిపూడి ఈ సినిమాని డిజైన్ చేశారని చెబుతున్నారు.
బాలకృష్ణతో సినిమా కోసం రావిపూడి పూర్తిగా తన స్టైల్ ను మార్చేసారనేది తాజా గుసగుస. రివెంజ్ డ్రామా.. యాక్షన్ కంటెంట్ తో ఈసారి సరికొత్త రావిపూడిని చూస్తామని చెబుతున్నారు.
అదే క్రమంలో ఎంపిక చేసే టైటిల్ గురించి అభిమానులు సహా చిత్రబృందంలో చాలా ఉత్కంఠ నెలకొంది. అనిల్ రావిపూడి మూడు అక్షరాల టైటిల్ ను ఎంపిక చేసాడని.. బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10) న టైటిల్ పోస్టర్ ని ఆవిష్కరించనున్నారని సమాచారం.
ఈ చిత్రంతో తొలిసారిగా కాజల్ బాలయ్య సరసన నటిస్తోంది. శ్రీలీల కీలక పాత్రధారి. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రం అత్యంత భారీగా విడుదలవుతుందని సమాచారం.