Begin typing your search above and press return to search.

NBK 108: ఈ టైటిల్ ఫిక్స్ అయితే..

By:  Tupaki Desk   |   30 May 2023 4:23 PM GMT
NBK 108: ఈ టైటిల్ ఫిక్స్ అయితే..
X
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ బాలయ్యకి జోడీగా నటిస్తోంది. బాలకృష్ణ స్టైల్ యాక్షన్ తో పాటు అనిల్ రావిపూడి స్టైల్ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రంలో ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ మూవీలో యంగ్ హీరోయిన్ శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. ఆమె చేస్తోన్న రోల్ ఏంటి అనేదానిపై క్లారిటీ లేదు. కొంతమంది కూతురు పాత్రలో నటిస్తోందని అంటే, మరికొంత మంది ఆమెకి సెక్యూరిటీగా బాలకృష్ణ క్యారెక్టర్ ఉంటుందని చెబుతున్నారు. వీటిలో ఏది వాస్తవం అనేదానిపై ఎలాంటి క్లారిటీ లేదు. శ్రీలీల పాత్రని కాస్తా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వీలైతే అంతకంటే ముందుగానే తీసుకొచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే మాట వినిపిస్తోంది.

తాజాగా ఈ మూవీ కోసం ఇంటరెస్టింగ్ టైటిల్ ని ఖరారు చేసింట్లు టాక్ నడుస్తోంది. భగవంత్ కేసరి అనే టైటిల్ ని చిత్రానికి ఖరారు చేసారంట. దీనికి ట్యాగ్ లైన్ గా ఐ డోంట్ కేర్ వాడినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ టైటిల్ సౌండ్ పరంగా వినడానికి బాగానే ఉంది. కేసరి అనే పదం ఎక్కువగా పంజాబీ సిక్కులకి ఉంటుంది. ముఖ్యంగా స్వాతంత్ర్య ఉద్యమంలో కేసరి ఇంటిపేరు ఉన్న వారు ప్రముఖంగా ఉంటారు. ఇలాంటి పవర్ ఫుల్ పేరుని ఇప్పుడు బాలకృష్ణ మూవీకి పెట్టడం అంటే కచ్చితంగా అతని పాత్ర కొత్తగా ఉండే ఛాన్స్ ఉంటుందనే మాట వినిపిస్తోంది.

అఖండ, వీరసింహారెడ్డి లాంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత బాలయ్య నుంచి వస్తోన్న సినిమా కావడం అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అలాగే ఫెయిల్యూర్ అనేది లేకుండా కమర్షియల్ సక్సెస్ లతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి మూవీ అనేసరికి ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటాయి. వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమా కావడంతో ఎన్బీకె 108 సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొని ఉంది.