Begin typing your search above and press return to search.

NBK 108 నెక్స్ట్ లెవల్ అంతే..!

By:  Tupaki Desk   |   23 Jan 2023 2:32 PM GMT
NBK 108 నెక్స్ట్ లెవల్ అంతే..!
X
వీర సింహా రెడ్డితో బాక్సాఫీస్ పై మరోసారి సింహంలా గర్జించిన బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపుడితో ఫిక్స్ చేసుకున్నాడని తెలిసిందే. ఎన్.బి.కె 108 గా వస్తున్న ఈ కాంబో సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేశారు. అనీల్ మార్క్ ఎంటర్టైన్ మెంట్ మూవీగా తీస్తూనే బాలయ్య మార్క్ మాస్ అంశాల మీద ఫోకస్ పెట్టాడట డైరెక్టర్. ఎన్.బి.కె 108 సినిమాలో ప్రియాంకా జవల్కర్, శ్రీ లీల లాంటి భామలు నటిస్తారని తెలుస్తుంది.

వీర సింహా రెడ్డి సినిమా కంప్లీట్ యాక్షన్ మూవీ కాగా అనీల్ రావిపుడి సినిమా మాత్రం డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది. బాలయ్యలోని కామెడీ యాంగిల్ ని ఈ సినిమాలో చూపించబోతున్నారట అనీల్ రావిపుడి. కథ విన్నప్పుడే తన పాత్ర గురించి బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసినట్టు టాక్. ఎలాగు వీర సింహా రెడ్డి హిట్టు కాబట్టి ఆ జోష్ తో ఈ 108వ సినిమా కూడా అదే హిట్ మేనియా కొనసాగించేలా చూస్తున్నారు.

పటాస్ నుంచి ఎఫ్ 3 వరకు తన సినిమాల విషయంలో లెక్క తప్పని అనీల్ రావిపుడి ఈసారి బాలయ్యతో పర్ఫెక్ట్ మాస్ ఎంటర్టైనర్ గా రాబోతుందని తెలుస్తుంది.

ఈ సినిమా తర్వాత బాలకృష్ణ మరోసారి బోయపాటి శ్రీను సినిమా చేస్తాడని తెలుస్తుంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను రామ్ తో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే మళ్లీ బోయపాటి శ్రీనుతో బాలయ్య కలిసి సినిమా చేస్తారట. అఖండ 2 డిస్కషన్స్ లో ఉందని తెలుస్తుంది.

ఈమధ్య అన్ స్టాపబుల్ షోతో ఇంకాస్త మంది కొత్త ఫ్యాన్స్ ని ఏర్పరచుకున్నారు బాలకృష్ణ. అంతేకాదు యువ హీరోలతో ఆయన క్లోజ్ నెస్ చూస్తుంటే బాలయ్య వర్షన్ 2.O అనేలా ఉంది.

చూడు ఒకవైపే చూడు అన్న బాలకృష్ణ తనలోని ఈ సెకండ్ యాంగిల్ తో అందరికి చేరువవుతున్నారు. మొత్తానికి బాలకృష్ణ కెరీర్ ఊహించని రేంజ్ సూపర్ ఫామ్ తో దూసుకెళ్తుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.