Begin typing your search above and press return to search.

NBK 107: మరో పండగ టార్గెట్?

By:  Tupaki Desk   |   14 Aug 2022 4:38 AM GMT
NBK 107: మరో పండగ టార్గెట్?
X
నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని కలయికలు రాబోతున్న బాలకృష్ణ 107వ సినిమా షూటింగ్ ప్రస్తుతం తుది దశకు చేరుకున్న విషయం తెలిసిందే. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో ఫుల్ మాస్ సినిమా గా రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడం అలాగే గోపిచంద్ మలినేని క్రాక్ బాక్సాఫీస్ సక్సెస్ తరువాత చేస్తున్న సినిమా కావడంతో అన్ని రకాలుగా ఈ సినిమాపై అంచనాలను పెరిగిపోతున్నాయి.

తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనే నమ్మకంతో కూడా ఉన్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవల కొన్ని చర్చలు అయితే జరిపారు.

మొదట దసరా సమయానికి విడుదల చేయాలని అనుకున్నారు. కుదరకపోతే డిసెంబర్లో అయినా విడుదల చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ రెండు డేట్స్ కాకుండా 2023 సంక్రాంతికి విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఎందుకంటే ఇటీవల కొంత సినిమా షూటింగ్ ఆలస్యం కావడం అలాగే దసరా మిస్ అయితే మళ్ళీ సరైన డేట్స్ కూడా దొరకడం లేదు కాబట్టి సంక్రాంతి బరిలో సినిమాను విడుదల చేస్తే తప్పకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు వచ్చే అవకాశం ఉంటుంది అని గోపీచంద్ క్రాక్ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. అయితే అదే సమయానికి ప్రభాస్ ఆదిపురుష్, విజయ్ వారసుడు ఇంకా మరికొన్ని సినిమాలు వచ్చే అవకాశం అయితే ఉంది.

సంక్రాంతి అనగానే చాలా వరకు అగ్ర హీరోలు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఆ డేట్ ఏమాత్రం మిస్ అవ్వకుండా చూసుకోవాలని కూడా ఆలోచిస్తారు. ఇక బాలయ్య బాబు కూడా సంక్రాంతి అయితే బెటర్ అనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకు ప్రస్తుతం జై బాలయ్య అనే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నారు. అలాగే రెడ్డి గారు, అన్నగారు అనే టైటిల్స్ కూడా చర్చల దశలో ఉన్నాయి. మరి సినిమాకు ఎలాంటి టైటిల్ ఫైనల్ చేస్తారో చూడాలి.