Begin typing your search above and press return to search.
మూవీ పాస్ పునరాగమనం ధరలు కాస్త ఎక్కువే!
By: Tupaki Desk | 29 May 2023 6:00 AMమూవీపాస్ దేశవ్యాప్తంగా తిరిగి వచ్చింది. అధికారికంగా పునఃప్రారంభమవుతుందని కంపెనీ గురువారం నాడు ప్రకటించింది. తొలుత క్వార్టర్లీ (నాలుగు నెలలకు) సబ్‌స్క్రిప్షన్ లను అందిస్తుంది. నెలకు ఒకటి నుండి మూడు సినిమాలు చూడాలంటే 10 డాలర్లు వెచ్చించాలి. అంతకుమించి సినిమాలు చూడాలనుకుంట చెల్లించాల్సిన మొత్తం పెరుగుతుంది. సభ్యత్వాలు ఇప్పుడు US అంతటా అందుబాటులో ఉన్నాయని కంపెనీ గురువారం ప్రకటించింది. గత కొన్ని నెలలుగా దాని బీటా వ్యవధిలో వెయిట్ లిస్ట్ లోని వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉంది.
మూవీపాస్ ని దేశవ్యాప్తంగా సినీప్రేమికులకు అందించడం ద్వారా క్లిష్టమైన వేసవి కాలంలో అన్ని థియేటర్ లకు ట్రాఫిక్ ని పెంచేందుకు సహాయపడాలని థియేటర్ వ్యవస్థకు మా మద్దతును ప్రకటిస్తున్నామని మూవీపాస్ CEO సహ వ్యవస్థాపకుడు 'స్టేసీ స్పైక్స్' ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. కొత్తగా రూపొందించిన మా సేవలు భిన్నమైనవి. సభ్యులకు నెలవారీ క్రెడిట్ లను ఎలా ఉపయోగిస్తున్నారనే దాని ఆధారంగా సౌలభ్యాన్ని అందిస్తున్నాం. అదే సమయంలో వారిని థియేటర్ లలో సినిమాలు చూడమని ప్రోత్సహించే ప్లాన్ ఇది అని వెల్లడించారు.
పునఃప్రారంభంలో మూవీ పాస్ నాలుగు సబ్ స్క్రిప్షన్ ప్లాన్ లను అందిస్తోంది. స్టాండర్డ్ ప్లాన్ కి నెలకు 10 డాలర్లు ఖర్చవుతుంది. నెలకు ఒకటి నుండి మూడు సినిమాలను చూడటానికి దీంతో అనుమతి లభిస్తుంది. మూవీపాస్ బెస్ట్ సెల్లర్ గా చెబుతున్న బేసిక్ ప్లాన్ లో నెలకు 20 డాలర్లతో మూడు నుండి ఏడు సినిమాలను చూడవచ్చు. ప్రీమియం ప్లాన్ లో 5-11 సినిమాలకు నెలకు 30 డాలర్లు ఖర్చు అవుతుంది. ప్రో ప్లాన్ చూస్తే.. ఇది అత్యంత ఖరీదైనది. 40 డాలర్లు నెలకు చెల్లిస్తే 30 సినిమాలను చూడటానికి వీలుంటుంది.
దక్షిణ కాలిఫోర్నియా - న్యూయార్క్ మెట్రో ప్రాంతంలోని సభ్యులకు సభ్యత్వాల ధర ఎక్కువ. దేశవ్యాప్తంగా 4000 కంటే ఎక్కువ థియేటర్లలో ప్రామాణిక 2D స్క్రీనింగ్ ల కోసం అన్ని ప్లాన్ లు సరసమైనవని విశ్లేషిస్తున్నారు. ప్రతి ప్లాన్ క్రెడిట్ ల సెట్ తో వస్తుంది. వినియోగదారులు సినిమాలను చూడటానికి క్రెడిట్ లను వెచ్చిస్తారు. సినిమా ఉదయం ఆట సాయంత్రం ఆట లేదా వారాంతంలో షోలా? అనే అంశాలపై ఆధారపడి సినిమా ఖర్చుల క్రెడిట్ ల సంఖ్య ఆధారపడి ఉంటుంది.
గతంలోని మూవీ పాస్ యూజర్ లకు ఈసారి సబ్ స్క్రిప్షన్ ఆఫర్ లు అప్పట్లో ఉన్నంత ఉదారంగా లేవని అర్థమవుతుంది. కంపెనీ వినియోగదారులకు నెలకు 9.95 డాలర్లు చెల్లించి అపరిమిత చలనచిత్రాలను చూడటానికి అనుమతించేది. ఇది చాలా మంది విషయంలో నిజం కాదు. నిలకడలేని మోడల్ మూవీ పాస్ ని త్వరగా నగదు రూపంలోకి తీసుకెళ్లేలా చేసింది. దాని మాతృ సంస్థ 2020లో దివాలా తీసామని ప్రకటించింది.
మూవీ పాస్ పునరాగమనం విషయానికొస్తే... దాని బీటా వెయిట్ లిస్ట్ చాలా ఆసక్తిని కలిగిస్తోంది. మూవీపాస్ తెరిచిన మొదటి ఐదు నిమిషాల్లో 30000 మంది వ్యక్తులు చేరడానికి ప్రయత్నించడంతో 'అధిక డిమాండ్' వల్ల సర్వర్ క్రాష్ అయింది. మొదటి 24 గంటల్లో దాని వెయిట్ లిస్ట్ కు 4.6 లక్షల కంటే ఎక్కువ సైన్ అప్ లు ఉన్నాయని కంపెనీ తెలిపింది.