Begin typing your search above and press return to search.

మహేష్‌, జక్కన్న మూవీ బ్యాక్‌ డ్రాప్.. ఇంట్రెస్టింగ్ అప్డేట్‌

By:  Tupaki Desk   |   28 Jan 2023 4:00 PM GMT
మహేష్‌, జక్కన్న మూవీ బ్యాక్‌ డ్రాప్.. ఇంట్రెస్టింగ్ అప్డేట్‌
X
సూపర్ స్టార్‌ మహేష్ బాబు.. రాజమౌళి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే. బాహుబలి విడుదల అయినప్పటి నుండి వీరిద్దరి కాంబో సినిమా గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. కొన్ని కారణాల వల్ల మహేష్ బాబుతో సినిమా కాకుండా ఎన్టీఆర్‌.. రామ్ చరణ్‌ లతో మల్టీ స్టారర్‌ ను రాజమౌళి తెరకెక్కించాడు.

ఇన్నాళ్లు ఆర్ఆర్‌ఆర్‌ సినిమా యొక్క హడావుడి లో ఉన్న రాజమౌళి ఎట్టకేలకు మహేష్ బాబు సినిమా గురించి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా యొక్క ప్రమోషన్‌ లో ఉన్నా కూడా ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ మాత్రం కొన్ని నెలల నుండే మహేష్ బాబుతో సినిమా కోసం కథను రెడీ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

భారీ అడ్వంచర్‌ కథ తో మహేష్ బాబు హీరోగా రాజమౌళి సినిమా ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. ఆ విషయమై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు కానీ రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. హీరోగా మహేష్ బాబు ను హాలీవుడ్‌ రేంజ్ లో రాజమౌళి చూపించడం ఖాయం అంటూ అభిమానులు నమ్మకంతో ఉన్నారు.

మహేష్‌ బాబు తో రాజమౌళి తెరకెక్కించబోతున్న సినిమా ఆస్ట్రేలియా బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని తాజాగా ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌ వినిపిస్తుంది. గతంలో మహేష్ బాబుతో సుకుమార్‌ తెరకెక్కించిన నేనొక్కడినే తరహాలో ఇంట్రెస్టింగ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రాజమౌళి సినిమా తీయబోతున్నాడు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అతి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.