సూపర్ స్టార్ జక్కన్న మూవీ ముహూర్తం ఫిక్స్

Mon Feb 06 2023 11:23:50 GMT+0530 (India Standard Time)

Update on Maheshbabu And Rajamouli Film

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ రేంజ్ లో మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది. భారీ బడ్జెట్ తో ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై రానటువంటి సరికొత్త కథాంశంతో ఈ సినిమాని రాజమౌళి చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అప్డేట్స్ ఇప్పటికే జక్కన్న ఇచ్చేశాడు. సౌత్ ఆఫ్రికాలోనే అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ ఉంటుందని సినిమాలో వరల్డ్ అడ్వంచర్ ట్రావెలర్ గా మహేష్ బాబు పాత్ర ఉంటుందని చెప్పేశారు. దీంతో సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి.

ఇక ఈ సినిమాలో క్యాస్టింగ్ కోసం హాలీవుడ్ క్యాస్టింగ్ ఏజెన్సీతో జక్కన్న ఒప్పందం చేసుకున్నాడు. ఈ నేపధ్యంలో సినిమాలో హాలీవుడ్ నటులు ఎక్కువ మంది ఉంటారని టాక్ వినిపిస్తుంది. మర్వెల్ సిరీస్ లో నటించిన వారిని ఈ మూవీ కోసం ఎంపిక చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.

 ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత సుదీర్ఘ కాల్స్ షీట్స్ జక్కన్నకి ఇచ్చేశాడు.

ఇక ఈ సినిమా ప్రీప్రొడక్షన్ కోసం ఏకంగా 15 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మూవీ స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేస్తుంది అని టాక్. ఈ నేపధ్యంలో జూన్ లేదా జులై నెలలో ఈ మూవీ లాంచింగ్ ఉంటుందని తెలుస్తుంది.

లాంచింగ్ సందర్భంగానే మూవీ క్యాస్టింగ్ ని కూడా ఖరారు చేసి చెప్పే అవకాశం ఉన్నట్లుగా టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట. మరి ఈ సినిమాలో తారక్ మహేష్ బాబుకి విలన్ గా ఎవరిని ఎంపిక చేస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కచ్చితంగా విలన్ పాత్రలో అయితే హాలీవుడ్ నటుడు ఉంటాడని మాత్రం ప్రచారం జరుగుతుంది. అలాగే హాలీవుడ్ హీరోయిన్ ని మహేష్ బాబుకి జోడీగా ఎంపిక చేయనున్నట్లుగా తెలుస్తుంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.