లీడర్ 2లో మహేష్.. AVM వారు ఏమన్నారంటే?

Sun Aug 14 2022 13:10:48 GMT+0530 (IST)

Update on Leader 2 Movie

శేఖర్ కమ్ముల రానా దగ్గుపాటి కలయికలో వచ్చిన లీడర్ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కమర్షియల్గా పెద్దగా లాభాలను అందించలేదు కానీ ఈ సినిమాను ఇప్పటికీ అభిమానించే వారు చాలామంది ఉన్నారు. టీవీలలో చాలాసార్లు మంచి రేటింగ్స్ కూడా అందుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ AVM ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన ఈ సినిమా సీక్వెల్ వస్తే బాగుంటుంది అని అప్పట్లో చాలా మంది అభిప్రాయపడ్డారు. శేఖర్ కమ్ముల కూడా చాలామంది ఫ్యాన్స్ నుంచి ఆ ప్రశ్నను ఎదుర్కొన్నాడు. తప్పకుండా ఆ సినిమా కొనసాగింపుగా మరొక సినిమాను చేస్తాను అని కూడా శేఖర్ కమ్ముల గతంలో ఒక వివరణ అయితే ఇచ్చాడు.

కానీ మళ్ళీ ఎక్కడ ఆ విషయం గురించి పెద్దగా ప్రస్తావించింది లేదు. అయితే గతంలో మహేష్ బాబుతో మాత్రం లీడర్ 2 సినిమా ఉంటుంది అని చాలా రకాల కథనాలు అయితే వెలుపడ్డాయి. ఆ విషయంపై కూడా ఎవరు కూడా పెద్దగా స్పందించింది లేదు.

ఇక రీసెంట్గా AVM నిర్మాణ సంస్థ 4వ జనరేషన్ లో ఒకరు ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్ లను అలాగే చిన్న తరహా చిత్రాలను నిర్మిస్తున్న AVM నిర్మాణ సంస్థ యాజమాన్యంలో ఒకరైన అరుణ గుహన్ లీడర్ టు పై వస్తున్న రూమర్లకు కథనాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదివరకే కొన్ని చర్చలు జరిగాయి అంటూ భవిష్యత్తులో ఆ విషయంపై ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అని కూడా ఆమె తెలియజేశారు.

కాబట్టి మహేష్ బాబు లీడర్ టు విషయంలో మాత్రం చర్చలు అయితే కొనసాగినట్లు మొత్తానికి ఒక క్లారిటీ అయితే వచ్చింది. గతంలో శేఖర్ కమ్ముల మహేష్ బాబుకు ఫిదా కథ చెప్పిన విషయం తెలిసిందే.

కానీ స్టార్ హోదా కారణంగా కథ నచ్చినప్పటికీ మహేష్ చేయలేకపోయాడు. ఇక లీడర్ 2 లాంటి కథతో వస్తే మాత్రం తప్పకుండా మహేష్ ఒప్పుకుంటాడు అని చెప్పవచ్చు. ఇక కుదిరితే శివాజీ 2 కూడా ఉంటుందని కానీ రజనీకాంత్ శంకర్ గారు ఇతర కమిట్మెంట్స్ బిజీగా ఉన్నట్లు కరుణ గుహన్ వివరణ ఇచ్చారు.