Begin typing your search above and press return to search.

క‌ర‌ణ్ జోహార్ ఈ ప్ర‌య‌త్న‌మైనా త‌న‌కు క‌లిసొస్తుందా?

By:  Tupaki Desk   |   26 Sep 2022 10:35 AM GMT
క‌ర‌ణ్ జోహార్ ఈ ప్ర‌య‌త్న‌మైనా త‌న‌కు క‌లిసొస్తుందా?
X
త‌ను ప‌రిచ‌యం చేసిన వాళ్ల‌ని నిల‌బెట్ట‌డం కోసం బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్ జోహార్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు అనే విష‌యం తెలిసిందే. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2'తో తాను ప‌రిచ‌యం చేసిన హీరోయిన్ అన‌న్య పాండే విష‌యంలోనే క‌ర‌ణ్ ప్ర‌స్తుతం అదే చేస్తున్నాడు. రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన లేటెస్ట్ మూవీ 'లైగ‌ర్‌'. పూరి జ‌గ‌న్నాథ్ అత్యంత భారీ స్థాయిలో ప్ర‌తిష్టాత్మ‌కంగా పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కించిన ఈ మూవీ ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షోకే డిజాస్ట‌ర్ టాక్ ని సొంతం చేసుకుని షాక్ కు గురిచేసింది.

ఈ మూవీ ద్వారా బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే హీరోయిన్ గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌బైంది. తొలి మూవీతో తెలుగు ఆడియ‌న్స్ ని మెస్మ‌రైజ్ చేయాల‌నుకున్న అన‌న్య ఆశ‌ల్ని 'లైగ‌ర్‌' తెలుగుతో పాటు హిందీలోనూ ఆవిరి చేసింది.

ఇందులో అన‌న్య పోషించిన పాత్ర‌, ఆమె న‌ట‌న‌పై తీవ్ర విమ‌ర్శ‌లు ఎదురైన విష‌యం తెలిసిందే. దానికి కాఫీ విత్ క‌రణ్ షో మ‌రింత ఆజ్యం పోసింది. ఈ షోలో పాల్గొన్న అన‌న్య పాండే మ‌ద‌ర్ భావ‌నా పాండే టంగ్ స్లిప్ప‌యి అన‌న్య పాండే ఒకే సారి ఇద్ద‌రిలో డేటింగ్ చేస్తోందంటూ వెల్ల‌డించ‌డం మ‌రింత ఇర‌కాటంలో ప‌డేసింది.

ఈ నేప‌థ్యంలో త‌ను 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2'తో ప‌రిచ‌యం చేసిన అన‌న్య పాండే కేరీర్ ని మ‌ళ్లీ గాడిలో పెట్టాల‌ని క‌ర‌ణ్ జోహార్ రంగంలోకి దిగి స్వీయ నిర్మాణ సంస్థ ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్ లో నెట్ ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్ ని ప్లాన్ చేశాడు.

'కాల్ మీ బే' అనే పేరుతో ఈ వెబ్ సిరీస్ కు శ్రీ‌కారం చుట్టాడు. ఇందులో కోట్లాది రూపాయ‌ల స్కామ్ చేసే కోటీశ్వ‌రురాలైన యువ‌తిగా అన‌న్య పాండే క‌నిపించ‌బోతోంది. అయితే ఈ విష‌యం తెలిసిన వాళ్లంతా క‌ర‌ణ్ పై వ‌రుస కామెంట్ లు చేస్తున్నారు.

యాక్టింగ్ స్కిల్ లేని వారిని ఎంత కాపాడే ప్ర‌య‌త్నం చేసినా అది బూడిద‌లో పోసిన ప‌న్నీరే అవుతుండ‌ని నెటిజ‌న్ లు కాబెంట్ లు చేస్తున్నారు. ఓటీటీలో రాణించాలంటే ముందు త‌న‌కు యాక్టింగ్ స్కిల్స్ వుండాల‌ని ఆ విష‌యంలో పూర్ అయిన అన‌న్య‌ని క‌ర‌ణ్ ఎలా కాపాడ‌తాడో అర్థం కావ‌డం లేద‌ని, మ‌రి క‌ర‌ణ్ ప్ర‌య‌త్నం అయినా అన‌న్య‌కు క‌లిసొస్తుందా? అని స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. సొంత నిర్మాణంలో క‌ర‌న్ చేస్తున్న ఈ ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో వేచి చూడాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.