నటవారసుడి డెబ్యూ.. స్టార్ కాస్టింగ్ లో తగ్గేదేలే

Mon Nov 28 2022 13:01:57 GMT+0530 (India Standard Time)

Update on Ibrahim Ali Khan Debut Movie

బాలీవుడ్ లో మరో నటవారసుడి ఘనమైన ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. యథావిధిగా సదరు నటవారసుడిని డీన్ కరణ్ జోహార్ వెండితెరకు పరిచయం చేస్తుండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీఖాన వారసుడు ఇబ్రహీం అలీఖాన్ తొలి చిత్రం కోసం కరణ్ జోహార్ యాజమాన్యంలోని ధర్మ ప్రొడక్షన్స్ ఇప్పటికే ప్రీప్రొడక్షన్ కాస్టింగ్ ఎంపికలను ప్రారంభించింది. ఇబ్రహీం అలీఖాన్  తొలి సినిమాకి కయోజ్ ఇరానీ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.తాజా సమాచారం మేరకు ఈ చిత్రంతో  12 ఏళ్ల తర్వాత కాజోల్ మళ్లీ తన స్నేహితుడు కం నిర్మాత అయిన కరణ్ తో జతకట్టింది. కరణ్ జోహార్ - కాజోల్ చిన్నప్పటి నుండి స్నేహితులు. బాలీవుడ్ లో కుచ్ కుచ్ హోతా హై- దిల్వాలే దుల్హనియా లే జాయేంగే - కభీ ఖుషీ కభీ గమ్ వంటి అనేక హిట్ ప్రాజెక్ట్ లను ఈ కాంబో అందించారు. అయితే కరణ్ 'ఏ దిల్ హై ముష్కిల్' .. అజయ్ దేవగన్ నటించిన 'శివాయ్' బాక్సాఫీస్ వద్ద ఘర్షణ పడడంతో కరణ్ - కాజోల్ నడుమ స్నేహబంధం చెడిందని కథనాలొచ్చాయి. వీరిద్దరూ తమ విభేదాలను ఇప్పటికి పరిష్కరించుకున్నారు. వారు మళ్లీ కలుస్తారని అభిమానులు చాలా కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా తాజాగా శుభవార్త అందింది.

ఇప్పుడు ఇబ్రహీం అలీ ఖాన్ తొలి ప్రాజెక్ట్ కోసం ఆ ఇద్దరి పునఃకలయిక ఖరారైనందున ఇన్నాళ్ల అభిమానుల నిరీక్షణకు చెక్ పడిపోబోతోంది. కాజోల్ కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ తో 12 సంవత్సరాల తర్వాత కాజోల్ ఇబ్రహీం అలీ ఖాన్ తో కలిసి పని చేయనుంది. యువహీరో అరంగేట్ర చిత్రంలో కాజోల్ పాత్ర ఏమిటన్నది తెలియాల్సి ఉంది.

తాజా సమాచారం మేరకు...గ్రేట్ ఫ్రెండ్స్ కాజోల్ - KJo తిరిగి కలుస్తున్నారు అనగానే మునుముందు ఇది చాలా బలమైన సమీకరణాలకు దారి తీయొచ్చని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇబ్రహీం అలీ ఖాన్ డెబ్యూ తర్వాత తిరిగి ఆ ఇద్దరూ చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నారనేది టాక్. 12 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలసిపోయారు. ఇప్పుడు కలతలు లేవు.

నిజానికి ఈ జోడీ చివరిగా 2010లో విడుదలైన షారూఖ్ 'మై నేమ్ ఈజ్ ఖాన్' చిత్రం కోసం కలిసి పనిచేశారు.  చాలా గ్యాప్ తర్వాత కరణ్  తదుపరి ప్రొడక్షన్ వెంచర్ పై కాజోల్ సంతకం చేసింది. కొత్త హీరో ఇబ్రహీం అలీ ఖాన్ నటశిక్షణ ఇప్పటికే పూర్తయింది. డ్యాన్సులు ఫైట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తండ్రి లెగసీని ముందుకు నడిపించేందుకు అతడు సిద్ధమవుతున్నాడు.

కాజోల్ ఈ చిత్రంలో భావోద్వేగంతో కూడుకున్న బలమైన పాత్రను పోషిస్తుంది. ఇబ్రహీం అలీ ఖాన్ తో మ్యాగ్జిమమ్ స్క్రీన్ సమయాన్ని షేర్ చేసుకోనుంది. ఇబ్రహీం తండ్రి సైఫ్ అలీఖాన్ తో కలిసి కాజోల్ పలు చిత్రాల్లో నటించింది. దిల్లగి- హమేషా .. తాన్హాజీ: ది అన్ సంగ్ వారియర్ వంటి చిత్రాలకు పనిచేసింది. ఇప్పుడు అతని మొదటి చిత్రంలోనే అతని కుమారుడితో కలిసి నటించడానికి థ్రిల్లింగ్ గా ఉందని సమాచారం. ఇబ్రహీం కూడా తన ప్రిపరేషన్ ప్రారంభించాడు . కాజోల్ వంటి అనుభవజ్ఞులైన నటీనటులతో స్క్రీన్ స్పేస్ ను షేర్ చేసుకోవాలని ఉత్సాహంగా సిద్ధంగా ఉన్నాడు.

అయితే దీనిపై కాజోల్ కానీ.. చిత్ర నిర్మాత కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ప్రాజెక్ట్  కోసం ఇతర నటీనటుల ఎంపిక ముంబైలో జరుగుతోందని తెలిసింది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.