రామబాణంలా దూసుకొస్తున్న గోపీచంద్ జగ్గూబాయ్..!

Thu Mar 30 2023 09:31:48 GMT+0530 (India Standard Time)

Update on Gopichand Ramabanam Film

సూపర్ డూపర్ హ్యాట్రిక్ కాంబోతో రాబోతున్నారు గోపీచంద్ శ్రీవాస్. గోపీచంద్ కథానాయకుడిగా తాజాగా రాబోతున్న చిత్రం రామబాణం. అయితే ఈ సినిమాకు శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే గోపీంచద్ శ్రీవాస్ కాంబోలో గతంలో లక్ష్యం లౌక్యం చిత్రాలు కూడా తెరకెక్కాయి. అవి రెండు కూడా హిట్టు కావడంతో ఈసారి హ్యాట్రిక్ కొడతారని అంతా భావిస్తున్నారు.ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాని మే5వ తేదీన వేసవి సెలవుల్లో విడుదల చేస్తున్నట్లు సమాచారం. శ్రీవాస్ గోపీచంద్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాలో డింపుల్ హయతి హీరోయిన్ గా కనిపిస్తుండగా... మరో సీనియర్ స్టార్ హీరో జగపతి బాబు కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ బయటకు వచ్చింది.

అదేంటంటే.. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని నేడు చిత్రబృందం ఓ పోస్టర్ ను విడుదల చేసింది. అందులో గోపీచంద్ జగ్గూబాయి వైట్ అంట్ వైట్ పంచలు కట్టుకొని... తలకు పాగా చుట్టి నుదుటిన కుంకుమ విభూది ధరించి అందంగా కనిపించారు. ఒకరి చేయి ఒకరు పట్టుకొని నడుచుకుంటూ వస్తున్న ఈ ఫొటోను చిత్రబృందం షేర్ చేసింది. ఇదేదో గుడిలో పూజ తర్వాత తీసిన ఫొటోలాగా కనిపిస్తుంది.

ఈ ఫొటోతో పాటు సినీ ప్రేక్షకులందరికీ చిత్రబృందం శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపింది. కుడివైపు గోపీచంద్ ఎడమవైపు జగపతి బాబు.. స్టైలిష్ గా నడుచుకుంటూ వస్తున్న ఈ పోస్టర్ అందరినీ అలరిస్తోంది.

ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు సామాజిక సందేశం కూడా మిళితమైన బలమైన కథాంశం ఇది అని తెలియబోతోంది. కథకు తగ్గ నటీనటులు ఉత్తమ సాంకేతిక నిపుణులతో నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం అని సమాచారం.

సచిన్ ఖేడ్కర్ నాజర్ అలీ రాజా రవీంద్ర వెన్నెల కిషోర్ సప్తగిరి కాశీ విశ్వనాథ్ సత్య తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. అలాగే ఈ రామబాణానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా... భూపతి రాజా కథను అందించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.