ఫిబ్రవరి సినిమాలు.. గెలుపెవరిది?

Tue Jan 31 2023 10:01:50 GMT+0530 (India Standard Time)

Update on February Tollywood Movies

సంక్రాంతి సందర్భంగా జనవరి నెలలో రిలీజ్ అయిన సినిమాలలో వాల్తేర్ వీరయ్య బ్లాక్ బస్టర్ కాగా వీరసింహారెడ్డి కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక దిల్ రాజు వారసుడు మూవీ కూడా కలెక్షన్స్ పరంగా హిట్ బొమ్మగానే నిలిచింది.  అయితే తరువాత వచ్చిన సుదీర్ బాబు హంట్ మూవీ ఆకట్టుకోలేదు. ఇక పాన్ ఇండియా మూవీగా వచ్చిన పఠాన్ తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇలా జనవరి మేగ్జిమమ్ సినిమావాళ్ళకి సంతోషాన్ని ఇచ్చింది. ఇక ఫిబ్రవరి నెల వస్తుంది.ఈ నెలలో చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ఎవరికి వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకొబోతున్నారు. ఈ నెలలో రిలీజ్ కాబోతున్న సినిమాలు అన్నింటిపైన కూడా పాజిటివ్ బజ్ ఉండటం ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి3న యంగ్ హీరో సుహాస్ నంచి రైటర్ పద్మభూషణ్ అనే సినిమా వస్తుంది.

తరువాత సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి బుట్టబొమ్మ మూవీ ఫిబ్రవరి 4న రిలీజ్ అవుతుంది. అలాగే కిరణ్ అబ్బవరం గీతా ఆర్ట్స్ లో చేసిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ ఫిబ్రవరి 17న రిలీజ్ కాబోతుంది. వీటిపై కొంత బజ్ ఉంది. ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్స్ తో రావడంతో ఎంటర్టైన్ చేస్తాయని భావిస్తున్నారు.

వీటితో పాటు కళ్యాణ్ రామ్ నుంచి అమిగోస్ ఫిబ్రవరి 10న రాబోతుంది. మూడు పాత్రలలో కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో నటిస్తూ ఉండటం ఆసక్తి పెంచింది. సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ మైఖేల్ ఫిబ్రవరి 3న రాబోతుంది. దీనిపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

అలాగే ధనుష్ తెలుగులో చేస్తున్న సార్ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమాపైన కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే అన్నిటికంటే ఎక్కువ బజ్ ఉన్న ప్రాజెక్ట్ అంటే సమంత శాకుంతలం.

మైథలాజికల్ కాన్సెప్ట్ తో భారీ బడ్జెట్ మూవీగా 3డీ వెర్షన్ లో ప్రేక్షకులని అలరించడానికి రెడీ అవుతుంది. ఫిబ్రవరి 17న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. గుణశేఖర్ నుంచి చాలా కాలం తర్వాత ఈ సినిమా వస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో సమంత ఇమేజ్ కి తగ్గట్లుగానే శాకుంతలం సినిమాపై అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తున్నారు. అన్ని సినిమాలు కూడా మంచి అంచనాలతోనే థియేటర్స్ లోకి వస్తున్న నేపధ్యంలో ఫిబ్రవరి నెలలో ప్రేక్షకులలు ఎక్కువ ఓట్లు దేనికి వేస్తారనేది ఆసక్తికరంగా మారింది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.