Begin typing your search above and press return to search.

దుల్కర్ కోసం సుక్కు గ్యాంగ్ ప్రయత్నం?

By:  Tupaki Desk   |   7 Oct 2022 4:05 AM GMT
దుల్కర్ కోసం సుక్కు గ్యాంగ్ ప్రయత్నం?
X
మలయాళం మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ మొత్తానికి ఇటీవల సీతారామం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అంతకుముందే అతనికి మహానటి సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు లభించింది. ఆ సినిమాలో అతను ఒక విధంగా కీర్తి సురేష్ తో పాటు పోటీకి నటించాడు. జెమినీ గణేషన్ పాత్రకు అతను తప్పితే మరొకరు సెట్ అవ్వరు అనే విధంగానే దుల్కర్ సల్మాన్ అద్భుతమైన నటనను కనబరిచారు.

ఇక మొత్తానికి అదృష్టవశాత్తు సీతారామం సినిమాలో అవకాశం దొరికింది. ఫ్లాప్ దర్శకుడు అయినప్పటికీ హను చెప్పిన కథను నమ్మిన దుల్కర్ సల్మాన్ మొత్తానికి బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద విజయాన్ని అందుకున్నాడు.

ఇక ఇప్పుడు అతనికి నలువైపులా నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు దర్శకులు కూడా దుల్కర్ సల్మాన్ పై ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే దుల్కర్ సల్మాన్ మాత్రం డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు.

అలాగని పూర్తిస్థాయిలో ప్రేమకథలు కాకుండా డిఫరెంట్ జనార్స్ లో కూడా సినిమాలు చేయాలని ఆలోచిస్తున్నాట్లుగా తెలుస్తోంది. రీసెంట్గా అతను సుకుమార్ టీం లోని శిష్యులను కూడా కలిసినట్లుగా తెలుస్తోంది. మైత్రి కూడా దుల్కర్ సల్మాన్ డేట్స్ తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా సుకుమార్ తన శిష్యులకు సపోర్ట్ చేసేందుకు ఎవరితోనైనా మాట్లాడతారు. అవసరం అయితే తనే ఒప్పిస్తాడు.

ఇక ఇటీవల తన శిష్యులలో ఒకరు దుల్కర్ సల్మాన్ కు సరిపోయే కథ గురించి చెప్పడంతో మైత్రి మూవీ మేకర్స్ తో చర్చలు జరిపినట్లు టాక్ అయితే వస్తుంది. దుల్కర్ ఇంకా కథ అయితే వినలేదని తెలుస్తోంది. కానీ సుకుమార్ స్కూల్ నుంచి వస్తే మాత్రం తప్పకుండా ఆ కథపై దుల్కర్ ఆసక్తి చూపించే అవకాశం అయితే ఉంటుంది.

అందులోనూ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో సినిమా ఉంటుంది కాబట్టి అతనికి కలిసి వచ్చే అంశమే. మరి దుల్కర్ సల్మాన్ సుకుమార్ శిష్యుడికి సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి. అలాగే దుల్కర్ సల్మాన్ ఖాన్ తదుపరి సినిమాలను మలయాళంలోనే కాకుండా తెలుగులో కూడా భారీ స్థాయిలోనే విడుదల చేయాలని ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతం అతను కోక్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.