దసరా సినిమా ఓవర్సీస్ రైట్స్ అన్ని కోట్లా?

Fri Mar 24 2023 09:35:34 GMT+0530 (India Standard Time)

Update on Dasara Overseas Market

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఒదేల దర్శకత్వంలో తెరకెక్కిన దసరా సినిమా ప్రేక్షకుల ముందుకి మార్చి 30న రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో ప్రస్తుతం నాని బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో దానికి తగ్గట్టుగానే ప్రమోషన్ చేసుకున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ పూర్తిగా జరిగిపోయినట్లు తెలుస్తోంది. అన్ని భాషలలో మూవీ ఫ్యాన్సీ రేటుకు అమ్మేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకులందరికీ కూడా కనెక్ట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. సినిమాలో ప్రధానంగా నాని క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. అలాగే కీర్తి సురేష్ పాత్రకూడా ఈ మూవీలో చాలా కీలకంగా ఉండబోతుంది.

సుకుమార్ పాత సినిమాలతో పోలిక పెట్టిన కూడా కచ్చితంగా కంటెంట్ యూనివర్సల్ అప్పీల్ తో అన్ని వర్గాల ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ఓవర్సీస్ రైట్స్ ని కూడా ప్రస్తుతం ఫాన్సీ రేట్ కి అమ్మేసినట్లు తెలుస్తుంది.

ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేసే ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ఏకంగా 6 కోట్లు పెట్టి దసరా థీయాట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నాని ఇమేజ్ పరంగా చూసుకుంటే ఓవర్సీస్ లో దసరా సినిమాకి 6 కోట్ల రూపాయలు వెచ్చించారు అంటే కచ్చితంగా పెద్ద మొత్తం  అని చెప్పాలి.

మరి ఆ స్థాయిలో ఓవర్సీస్ లో దసరా మూవీ కలెక్షన్స్ రాబడుతుందా అనేది చూడాలి. ఇక ఈ సినిమాతో ఏకంగా 150 కోట్ల మార్క్ అందుకోవాలని నాని భావిస్తున్నారు. ఇలా ఈ క్లబ్ లో చేరడం ద్వారా తను కూడా హీరోగా నెక్స్ట్ లెవెల్ కి ప్రమోషన్ పెంచుకోవాలని అనుకుంటున్నారు.

ఇంకా దసరా సక్సెస్ బట్టి నేచురల్ స్టార్ నాని రెమ్యూనరేషన్ కూడా పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట. ఏది ఏమైనా ఈ సినిమా నాని కెరియర్ లో కచ్చితంగా ఒక మైలురాయిగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.  నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.